యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య కరోనా బారిన పడింది. తనకు కరోనా సోకిన విషయాన్ని ఐశ్వర్య స్వయంగా ప్రకటించింది.
“రీసెంట్ గా నాకు కరోనా సోకింది. వైద్య బృందం సహాయంతో ఇంట్లోనే నేను క్వారంటైన్ లో ఉన్నాను. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గడిచిన కొన్ని రోజులుగా నాతో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా దయచేసి జాగ్రత్తగా ఉండండి, మాస్క్ ధరించండి. పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే అప్ డేట్ ఇస్తా.”
ఇలా తనకు కరోనా సోకిన విషయాన్ని ఐశ్వర్య బయటపెట్టింది. అర్జున్ కుటుంబంలో వరుసగా విషాధ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటిమొన్న అర్జున్ మేనల్లుడు చిరంజీవి హఠాత్తుగా మరణించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు చిరంజీవి తమ్ముడికి కరోనా సోకింది. ఇప్పుడు ఐశ్వర్య కూడా కరోనా బారిన పడింది.
ఏడేళ్ల కిందటే కోలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య. కన్నడలో చేసిన ఓ సినిమాతో అవార్డ్ కూడా అందుకుంది. త్వరలోనే కూతుర్ని గ్రాండ్ గా తెలుగులోకి తీసుకొచ్చేందుకు అర్జున్ ప్రయత్నిస్తున్నాడు. ఇంతలోనే ఆమె ఇలా కరోనా బారిన పడింది.