సోషల్ మీడియాలో దర్శకుడు ఆర్జీవీ ఎంతటి సంచలనాలు సృష్టిస్తారో, నటి శ్రీరెడ్డి కూడా అంతే సంచలనం సృష్టించగలరు. కొన్నాళ్ల క్రితం విజువల్ మీడియాను, సోషల్ మీడియాను సమానంగా ఊపేసిన శ్రీరెడ్డి చెన్నయ్ కు మకాం మార్చి సైలంట్ అయ్యారు. కానీ ఇప్పుడు మళ్లీ శ్రీరెడ్డి వార్తల్లోకి రాబోతున్నారు.
దర్శకుడు ఆర్జీవీ మీద కసితో, ఆయన సినిమా పవర్ స్టార్ కు పోటీగా అన్నట్లుగా, పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్ నూతన్ నాయుడు పరాన్నజీవి అనే సినిమా నిర్మాణం ప్రారంభించారు.
ఆర్జీవీ పవర్ స్టార్ కన్నా ముందుగానే ఈ సినిమాను విడుదల చేయాలని 24/7 పని చేస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. ఈ మంగళవారం (21) నుంచి షూటింగ్ ప్రారంభించి, రెండు మూడు రోజుల్లో పూర్తి చేసే సంకల్పంతో వున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాలో శ్రీరెడ్డి ఓ కీలకపాత్రలో కనిపించబోతోంది. కేవలం శ్రీరెడ్డి మాత్రమే కాదు, మరికొంతమంది నోటెడ్ పర్సనాలిటీలు కూడా ఈ సినిమాలో కనిపిస్తాయని తెలుస్తోంది. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, నిర్మాణం, దర్శకత్వం నూతన్ నాయుడు.