లెక్కప్రకారం సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి అజిత్ సినిమా. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. అలా పొంగల్ నుంచి తప్పుకున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమైంది.
అజిత్ హీరోగా నటించిన విడాముయర్చి సినిమాను ఫిబ్రవరి 6న విడుదల చేయాలని నిర్ణయించారు. తెలుగు ప్రజల అదృష్టం కొద్దీ ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో విడుదల చేయడం లేదు. తెలుగు వెర్షన్ కు ‘పట్టుదల’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
కొద్దిసేపటి కిందట ‘పట్టుదల’ ట్రయిలర్ రిలీజ్ చేశారు. చేసింది యాక్షన్ సినిమానే అయినప్పటికీ, అజిత్ చేసిన స్టంట్స్ కు ట్రయిలర్ లో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు. సినిమాలో ఉన్న ఎమోషన్, సస్పెన్స్ ను చూపించాలనుకున్నారు. అదే పని చేశారు కూడా.
అజిత్ తో పాటు కీలక పాత్రలు పోషించిన త్రిష, అర్జున్, రెజీనా పాత్రలే ఎక్కువగా ట్రయిలర్ లో కనిపించాయి. సినిమా మొత్తం ఈ 4 పాత్రల చుట్టూనే తిరుగుతుందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. అజర్ బైజాన్ లో తీసిన యాక్షన్ సీన్స్, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రయిలర్ లో హైలెట్. ఇక అజిత్ ను డిఫరెంట్ లుక్స్ లో చూపించడం కూడా బాగుంది.
ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ దక్కించుకోగా.. స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకుడు.
musali bafoon
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
All the best