cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

మన పాకిస్తాన్ లో మన 'అఖండ' సినిమా

మన పాకిస్తాన్ లో మన 'అఖండ' సినిమా

"ఇవాళ పొద్దున్నే చూసాను. పాకిస్తాన్లో కూడా అక్కడ వాళ్లు..అదెవరో నాకు వాట్సాప్ చేసారు..అక్కడ వాళ్లు మాట్లాడుకోవడం మన సినిమా గురించి...మన పాకిస్తాన్లో మన అఖండ సినిమా గురించి"...ఇదీ బాలకృష్ణగారు నేడు "అఖండ" సక్సెస్ ఫంక్షన్లో చెప్పిన ఎవ్వరికీ తెలియని విషయం. 

పాకిస్తాన్లో "అఖండ" సినిమా గురించి చర్చ జరుగుతోందా? ఆ సంగతి ఈయనకి ఎవరో వాట్సాప్లో చెప్పారా? 

ఏవన్నా అర్థముందా?

అర్థం లేదనే కాబోలు వేదిక మీద వెనుక నిలబడ్డ వ్యక్తులు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. 

ఎవరికైనా ఆవగింజంత వెర్రుంటుంది. కానీ మరీ ఇంతిలా పాకిస్తాను సైజులో వెర్రి ముదరడం మామూలు విషయం కాదు. ఇలా బాలకృష్ణ తెలుగు సినిమాని బోర్డర్ దాటించి పాకిస్తాన్లో అఖండంగా ఆడించేస్తున్నారు. 

అక్కడ..అదే "మన" పాకిస్తాన్లో "మన" బాలయ్యకి అభిమానుల సంఘం కూడా ఏర్పాటయ్యిందని "జై బాలయ్య" నినాదాలు పాకిస్తాన్ పార్లమెంటు పునాదుల్ని కుదిపేస్తున్నాయని రేపు ఆయనకింకో వాట్సాప్ మెసేజ్ వస్తుందేమో చూడాలి. 

ఒకవేళ వస్తే..అది మనం నమ్మి తీరాలి.

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు