అఖండ సీక్వెల్ వైపే బోయపాటి మొగ్గు?

బాలయ్య-బోయపాటి ఈ సినిమా చిరకాలంగా వార్తల్లో వుంటూనే వస్తోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాంచి పొలిటికల్ సబ్జెక్ట్ ను బాలయ్య కోసం బోయపాటి రెడీ చేసారని తెగ వార్తలు వచ్చేసాయి.  Advertisement నిజానికి అది…

బాలయ్య-బోయపాటి ఈ సినిమా చిరకాలంగా వార్తల్లో వుంటూనే వస్తోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాంచి పొలిటికల్ సబ్జెక్ట్ ను బాలయ్య కోసం బోయపాటి రెడీ చేసారని తెగ వార్తలు వచ్చేసాయి. 

నిజానికి అది కొంత వరకు నిజం కూడా. బోయపాటి దగ్గర ఓ మాంచి పోలిటికల్ బ్యాక్ డ్రాప్ సబ్జెక్ట్ వుంది. కానీ ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న వార్తల సారాంశం ఏమిటంటే తన బ్లాక్ బస్టర్ హిట్ అఖండ కు సీక్వెల్ తీయాలనే బోయపాటి ఫిక్స్ అయ్యారన్నది. ఇక్కడ రెండు మూడు పాయింట్లు వున్నాయి.

బాలయ్య – బోయపాటి సినిమా ఫిక్స్. అందులో సందేహం లేదు. కానీ ఈ సినిమాలోగా బాలయ్య-బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేస్తారా? లేక బోయపాటి కోసం వేచి వుంటారా? ఇది ఒక పాయింట్.

బాబీ సినిమా మొదలుపెట్టి పూర్తి చేసే సరికి ఆంధ్ర ఎన్నికల దగ్గరకు వస్తాయి. మధ్యలో తెలంగాణ ఎన్నికలు కూడా వుంటాయి. అందువల్ల బోయపాటి సినిమా చేయాలంటే ఆంధ్ర ఎన్నికల తరువాతే తప్ప ముందు సాధ్యమవుతుందా? బోయపాటి కి 14రీల్స్ బ్యానర్ కాకుండా వేరే బ్యానర్ లో చేయాలని వుందని, అందుకే అఖండ 2 ప్రాజెక్టు ను తెరపైకి తెచ్చారని టాక్ వినిపిస్తోంది. మరి అది ఎంత వరకు కరెక్ట్ అన్నది తెలియాల్సి వుంది.

అఖండ సీక్వెల్ చేయాలి అంటే దాని తొలి భాగం నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి మీద ఆ నిర్మాణ హక్కులు వుంటాయా? లేదా బాలయ్య అనుకుంటున్నట్లు 14 రీల్స్ కు అవకాశం వుంటుందా?

మొత్తం మీద బోయపాటి-బాలయ్య సినిమా ఇలా కొన్నాళ్ల పాటు వార్తల్లోనే వుండిపోయేలా వుంది.