‘అఖండ’ వచ్చేసాడు

బోయపాటి సినిమా సెట్ మీదకు హీరో బాలయ్య వచ్చేసాడు. 2021 లో స్టార్ట్ అయిన క్రేజీ ప్రాజెక్టుల్లో అఖండ ఒకటి.  Advertisement కరోనా కారణంగా డిలే అవుతూ వస్తున్న ఈ ప్రాజెక్టు లేటెస్ట్ షెడ్యూలు…

బోయపాటి సినిమా సెట్ మీదకు హీరో బాలయ్య వచ్చేసాడు. 2021 లో స్టార్ట్ అయిన క్రేజీ ప్రాజెక్టుల్లో అఖండ ఒకటి. 

కరోనా కారణంగా డిలే అవుతూ వస్తున్న ఈ ప్రాజెక్టు లేటెస్ట్ షెడ్యూలు ఈ రోజు ప్రారంభమైంది. అఘోరా 'అఖండ' గెటప్ లో బాలయ్య సెట్ మీదకు వచ్చారు. 

అఖండ గెటప్ ఇప్పటికే చిన్న టీజర్ రూపంలో గతంలోనే వెల్లడించారు. ఇప్పుడు విడుదల చేసిన స్టిల్ తో మరింత క్లారిటీ వచ్చింది.

ఈ స్టిల్ లో బాలయ్య కొంచెం లావుగా, బలంగా కనిపిస్తున్నాడు. వేసిన డ్రెస్, కండలు తిరిగిన శరీరం అన్నీ కలిసి ఈ క్యారెక్టర్ ను బోయపాటి కాస్త డిఫరెంట్ గా డిజైన్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

ఈ సినిమాతో హీరో శ్రీకాంత్ మరోసారి విలన్ గా పరిచయం అవుతున్నారు. బాలయ్య సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. 

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాత.