టాలీవుడ్‌లో ఓ సెంటిమెంట్ వుంది. ఏ ఇంట్లోనూ ఇద్దరు హీరోలు సక్సెస్ కాలేరు. ఈ సెంటిమెంట్ నుంచి మెగాస్టార్, పవన్ కళ్యాణ్ లకు మాత్రమే మినహాయింపు.
నాగార్జున, మహేష్ బాబు, అల్లు అర్జున్ దగ్గర నుంచి రఘుబాబు, అల్లరి నరేష్ వరకు ఇదే తరహా. అఖిల్ అక్కినేని పరిస్థితి చూస్తుంటే ఈ సెంటిమెంట్ మరోసారి నిజమయ్యేలా కనిపిస్తోంది. అన్న నాగ్ చైతన్య తరువాత ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. కానీ తొలి సినిమా నుంచి పరాజయం పలకరిస్తూనే వుంది. లేటెస్ట్ గా ఏజెంట్ సినిమా అయితే కనీ వినీ ఎరుగని డిజాస్టర్ గా మిగిలింది.
అటు నిర్మాత అనిల్ సుంకర, ఇటు హోల్ సేల్ బయ్యర్ సతీష్ ఇద్దరూ కుదలైపోయి, కోట్లకు కోట్లు నష్టాలు మిగుల్చుకున్నారు. ఆ తరువాత మరి అఖిల్ సినిమా ఏమిటి అన్న దానికి సమాధానం లేదు. యువి సంస్థలో సినిమా అన్న వార్తలు అప్పట్లో వినిపించాయి. ఇప్పుడు దాని పరిస్థితి ఏమిటి అన్నది తెలియదు. మరే నిర్మాత కూడా అఖిల్ తో సినిమా చేసే సాహసానికి పూనుకుంటున్నట్లు కనిపించడం లేదు.
యువి సంస్థ సినిమా కూడా ఇప్పట్లో తెరకెక్కుతుందా అంటే అనుమానమే. ప్రస్తుతం ఆ సంస్థ మెగాస్టార్ తో పాన్ ఇండియా సినిమా విశ్వంభర పనిలో బిజీగా వుంది. దాని తరువాత కానీ మరో భారీ ప్రాజెక్ట్ తలకెత్తుకోదు. ఆ సినిమా జనవరికి కానీ విడుదల కాదు. అప్పటి వరకు మరి అఖిల్ ఖాళీగా వుంటారా? లేక ఈ సినిమా మొదలుపెట్టి అలా అలా మెల్లగా నడిపిస్తూ వెళ్తారా? మొదలుపెట్టే అవకాశాలు అయితే కనిపించడం లేదు.
పెళ్లి వ్యవహారం కూడా అఖిల్ జీవితం లో కలిసి రాలేదు. నిశ్చితార్ధం అయిన తరువాత అది ఆగిపోయింది. కెరీర్ ఇలా పాజ్ లో వుండిపోయింది. తండ్రి నాగార్జున ఈ విషయంలో ఏమైనా ఆలోచిస్తున్నారో లేదో అనుమానమే. ఎందుకంటే నాగ్ తలుచుకుంటే స్టూడియో పతాకం మీద సినిమా తీయడం పెద్ద కష్టమైన విషయం కాదు. కానీ మరి నాగ్ కూడా సైలంట్‌గా వున్నారంటే అఖిల్ విషయంలో సమ్ థింగ్.. సమ్ థింగ్ అనుకోవాల్సి వస్తుంది.