శ్రీ‌ధ‌ర్ పిట్ట‌ల దొర కార్టూన్‌… ఆయ‌నే గుర్తొస్తారు!

కార్టూనిస్ట్ శ్రీ‌ధ‌ర్ అంటే తెలియ‌ని వారు వుండ‌రు. ఎల్లో ప‌త్రిక‌కు ఆయ‌న కార్టూన్లే ఎంతో ఆక‌ర్ష‌ణ‌గా ఉండేవి. కేవ‌లం ఇవాళ శ్రీ‌ధ‌ర్ ఏం కార్టూన్ వేశారో అని… ఎల్లో ప‌త్రిక‌ను చూసేవారు. ఎల్లో ప‌త్రిక‌లో…

కార్టూనిస్ట్ శ్రీ‌ధ‌ర్ అంటే తెలియ‌ని వారు వుండ‌రు. ఎల్లో ప‌త్రిక‌కు ఆయ‌న కార్టూన్లే ఎంతో ఆక‌ర్ష‌ణ‌గా ఉండేవి. కేవ‌లం ఇవాళ శ్రీ‌ధ‌ర్ ఏం కార్టూన్ వేశారో అని… ఎల్లో ప‌త్రిక‌ను చూసేవారు. ఎల్లో ప‌త్రిక‌లో సుదీర్ఘ కాలం ప‌ని చేసిన శ్రీ‌ధ‌ర్… వ‌య‌సు పైబ‌డ‌డంతో ఉద్యోగ విర‌మ‌ణ చేశారు. అయితే కార్టూన్ల‌ను ప్ర‌జ‌ల‌కు చేర‌వేయ‌డంలో మాత్రం ఆయ‌న ఇప్ప‌టికీ శ్ర‌మిస్తున్నారు.

సోష‌ల్ మీడియా వేదిక‌గా పాత కార్టూన్ల‌ను స‌మ‌యం, సంద‌ర్భం చూసుకుని క్యారీ చేస్తుంటారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ముగిసిన‌ప్ప‌టికీ, ఇంకా ఫ‌లితాలు వెలువ‌డాల్సి వుంది. ఈ నేప‌థ్యంలో శ్రీ‌ధ‌ర్ ఎన్నిక‌ల‌కు సంబంధించి కార్టూన్‌ను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. అందులో ఏముందంటే…

బీహార్‌లో ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఒక రాజ‌కీయ పార్టీ కార్యాల‌యంలో మేనిఫెస్టో త‌యారీపై అద్భుత‌మైన కార్టూన్‌ను ఆయ‌న వేశారు. 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు, ఆడ‌పిల్ల‌ల‌కు రూ.50 వేలు.. పింఛ‌న్లు అని మేనిఫెస్టో త‌యారు చేస్తున్న రాజ‌కీయ నాయ‌కుడు. 

మ‌న పార్టీ మేనిఫెస్టోను పిట్ట‌ల దొర‌తో రాయిస్తున్నా. ఇక  ఏ పార్టీ కూడా మ‌న‌తో పోటీ ప‌ద‌జాల‌దు అంటూ రాజ‌కీయ నాయ‌కుడు మ‌రో నాయ‌కుడితో అన్న‌ట్టు కార్టూన్ వేశారు. మేనిఫెస్టో రాస్తున్న పిట్ట‌ల దొర చిత్రం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌.

ఈ కార్టూన్ చూడ‌గానే చంద్ర‌బాబాబునాయుడే గుర్తుకొస్తారు. 2024 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌జాగ‌ళం పేరుతో విడుద‌ల చేసిన మేనిఫెస్టోను కూడా పిట్ట‌ల దొర‌తో రాయించార‌నే భావ‌న ఈ కార్టూన్ చూడ‌గానే క‌లుగుతుంది. చంద్ర‌బాబు కూడా 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. అలాగే మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, 19 నుంచి 59 ఏళ్ల లోపు మ‌హిళ‌ల‌కు ప్ర‌తి నెలా రూ.1500 ఇస్తాన‌ని, ఇలా ఆచ‌ర‌ణ సాధ్యం కాని హామీల‌న్నీ చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌లిసి ఇచ్చారు. అందుకే బీజేపీ త‌మ‌కు సంబంధం లేద‌ని తేల్చి చెప్పింది. శ్రీ‌ధ‌ర్ కార్టూన్ మాత్రం చంద్ర‌బాబును గుర్తు చేయ‌డం విశేషం.