Advertisement

Advertisement


Home > Movies - Movie News

అఖిల్ షర్ట్ విప్పేస్తాడా?

అఖిల్ షర్ట్ విప్పేస్తాడా?

షర్ట్ విప్పడం, సిక్స్ ప్యాక్ చూపించడం అన్నది హీరోలకు ఓ చిన్న ముచ్చట. బాలీవుడ్ లో దశాబ్దాల కిందటే స్టార్ట్ అయింది. కానీ మన దగ్గర కొన్నేళ్లుగా ఒక్కొక్కరు తమ సిక్స్ ఫ్యాక్ లను ప్రదర్శించుకుంటూ వస్తున్నారు. 

ఏదో ఫైటింగ్ సీన్ పెట్టడం, ఏ రౌడీనో చొక్కా లాగడం ఆ విధంగా సిక్స్ ప్యాక్ ప్రేక్షకులకు దర్శనం ఇవ్వడం. ఇప్పుడు ఇదే వ్యవహారంలోకి అక్కినేని అఖిల్ కూడా చేరుతున్నాడని బోగట్టా. 

బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా తరువాత అనిల్ సుంకర నిర్మాతగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో నలభై కోట్ల భారీ బడ్జెట్ సినిమా చేయాల్సి వుంది. 

ఈ సినిమాను అధికారికంగా ఈ నెల 7న ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ను వదలాల్సి వుంది. ఇందు కోసం రెండు డిజైన్లు తయారుచేయించారు. 

అందులో ఒకటి షర్ట్ లెస్ సిక్స్ ప్యాక్ పోస్టర్. ఈ పోస్టర్ వదలాలా? రెండో పోస్టర్ అయిన మామూలుది వదలాలా? అన్న డెసిషన్ ను హీరోకే వదిలేసారు. అఖిల్ ఒకె అంటే కనుక సిక్స్ ప్యాక్ పోస్టర్ బయటకు వస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?