Advertisement

Advertisement


Home > Movies - Movie News

'వకీలు' సినిమాలో ఇన్ని బూతులా?

'వకీలు' సినిమాలో ఇన్ని బూతులా?

సాధారణంగా సినిమాల్లో బూతు తిట్లు కామన్ అయిపోయింది. ఇంగ్లీష్ లో తిడితే జనాలకు పెద్దగా ఇబ్బందిగా వుండదని, ఆ రూటు ఎంచుకుంటున్నారు. అయితే పెద్ద హీరోల సినిమాలు ఫ్యామిలీలు కూడా చూడాల్సి వుంటుంది. లేకుంటే డబ్బులు సరిపోవు. అందుకని ఇలాంటి వ్యవహారాలకు దూరంగా వుంటారు. ఈవారం విడుదల కాబోతున్న వకీల్ సాబ్ లో ఈ తిట్లు, అన్ పార్లమెంటరీ పదాలు విచ్చలవిడిగా వాడేసినట్లు తెలుస్తోంది.

ఎందుకంటే సెన్సారు సర్టిఫికెట్ తో పాటు ఏవేం కట్ చేయమన్నారు. ఆ కటింగ్ లు చేసారా లేదా అన్నది ప్రేక్షకులకు తెలియడం కొసం థియేటర్ దగ్గర లిస్ట్ పెడతారు. ఆ లిస్ట్ ప్రయివేటు కాదు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ లిస్ట్ చూస్తుంటే ఈ తిట్ల గురించి అనుమానం కలుగుతోంది. అవేంటోచూద్దాం.

కట్ నెంబర్ 1. బిచ్..బ్లడీ శ్లగ్..లం..ముం..పదాలు కట్ చేయాలి. సబ్ టైటిల్స్ లోకూడా తీసేయాలి. (EXCISE అనే పదం సెన్సారు వాడింది). అయితే వీటిని తొలగించలేదు..మ్యూట్ చేసారు. తొలగించకుండా మ్యూట్ చేసినా జనాలకు అక్కడ ఏముందో అర్థం అయిపోతుంది.

కట్ నెంబర్ 2. కింద నువ్వు చూసుకో..పైన నేను చూసుకుంటా..ఇది కూడా తొలగించమన్నారు. మ్యూట్ చేసారు.

కట్ నెంబర్...3..ప్రాసిస్ట్యూషన్ అన్న పదం తొలగించమన్నారు..మ్యూట్ చేసారు.

కట్ నెంబర్ ..4...లం..లు,....లం..లు..అంటారు..బ్లడీ ఫకింగ్ బిచెస్..వేశ్యలంటారు..ఈ పదాలు అన్నీ తొలగించమన్నారు. మ్యూట్ చేసారు.

కట్ నెంబర్ ...5...ప్రాసిస్ట్యూషన్, ఫకింగ్..బిచెస్..ఇలాంటి పదాలు ఎక్కడ వున్నా తొలగించమన్నారు. మ్యూట్ చేసారు. 

మొత్తానికి ఇలాంటి పదాలు అన్నీ ఇలా వాడేసారు అంటే ఆ పదాలు వాడాల్సిన సీన్లు ఏమిటో? అవి ఫ్యామిలీలు చూడగలిగేలా వుంటాయో..వుండవో...సినిమా వస్తేనే తెలుస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?