Advertisement

Advertisement


Home > Movies - Movie News

ముద్దు ముచ్చ‌ట తీర్చ‌ని హీరో... విడిచిపెట్టిన ప్రియ‌రాలు

ముద్దు ముచ్చ‌ట తీర్చ‌ని హీరో... విడిచిపెట్టిన ప్రియ‌రాలు

బాలీవుడ్ హీరో అక్ష‌య్‌కుమార్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అక్ష‌య్‌లో బ‌హుముఖ కోణాలున్నాయి. కేవ‌లం న‌టుడిగానే కాకుండా నిర్మాత‌గా, మార్ష‌ల్ క‌ళాకారుడిగా మంచి గుర్తింపు పొందాడు. రెండుసార్లు ఫిలింఫేర్ పుర‌స్కారాలు అందుకున్నాడు.

న‌టుడిగా అక్ష‌య్‌కుమార్ వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌లు పోషించాడు. రొమాంటిక్‌, క‌మెడియ‌న్ హీరోగా న‌టించి అల‌రించాడు. 2015లో ఫోర్బ్స్ ప్రపంచంలో అత్య‌ధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల జాబితాలో 9వ స్థానంలో అక్షయ్ నిలిచారంటే, ఆయ‌న టాలెంట్‌ను అర్థం చేసుకోవ‌చ్చు. తాజాగా అక్ష‌య్‌కుమార్ త‌న ప్రేమ సంగ‌తుల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు.

ట్వింకిల్ ఖ‌న్నాను అక్ష‌య్ పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో ఓ అమ్మాయితో అక్ష‌య్ ప్రేమ కార్య‌క‌లాపాలు సాగిం చాడు. అయితే ఆ ప్రేమ మూణ్నాళ్ల ముచ్చ‌టే అయింది. తాజాగా అక్ష‌య్ ఒక షోలో త‌న‌ పూర్వ‌పు ప్రేమ సంగ‌తుల్ని అభిమానుల‌తో పంచుకున్నాడు.

టీనేజీలో ఓ అమ్మాయితో నాలుగైదు సార్లు డేటింగ్‌కు వెళ్లాన‌ని చెప్పాడు. సినిమాలు షికార్లు అంటూ తెగ తిరిగిన‌ట్టు తెలిపాడు.  ఓ సారి ఉడిపి రెస్టారెంట్ వెళ్లి భోజ‌నం కూడా చేసిన‌ట్టు తెలిపాడు. అయితే జాలీగా సాగిపోతోంద‌నుకున్న టైంలో ఉన్న‌ట్టుంది ఆ అమ్మాయి త‌న‌ని వదిలేసి వెళ్లిన‌ట్టు అక్ష‌య్ ఆశ్చ‌ర్యపోతూ చెప్పాడు.

అయితే ఆ అమ్మాయి త‌న‌ను వ‌దిలేసి వెళ్ల‌డానికి గ‌ల కార‌ణాన్ని కూడా అక్ష‌య్ తెలిపాడు. ముద్దులు ఇవ్వ‌క‌పోవ‌డం, కౌగిలింత‌లు లాంటివి తాను చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే త‌న‌ను ఆ అమ్మాయి వ‌దిలేసిన‌ట్టు అక్ష‌య్ చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. మొద‌టి నుంచి త‌న‌కు సిగ్గు ఎక్కువ‌ని, అదే స‌మ‌స్య‌గా మారింద‌న్నాడు.

తానెప్పుడూ ప్రియురాలి భుజంపై చేయి వేయ‌డం, చేతిని ప‌ట్టుకోవ‌డం లాంటి రొమాంటిక్ ప‌నులు చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల అమ్మాయికి తాను న‌చ్చ‌లేద‌ని చెప్పుకొచ్చాడు. త‌న నుంచి ఆ అమ్మాయి అవి బ‌లంగా కోరుకోవ‌డం, తాను చేయ‌క‌పోవ‌డంతో విడిచిపెట్టి త‌న దారి తాను చూసుకున్న‌ట్టు అక్ష‌య్ గ‌త ప్రేమ తాలూకూ జ్ఞాప‌కాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టాడు.

రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్

కామెడీ చెయ్యడం కామెడీ కాదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?