అలజడి రేపుతున్న అగ్రిమెంట్

రెంట్ సిస్టమ్‌కు బదులుగా షేరింగ్ మీద సినిమాలు ఆడేలా తెలంగాణ ఎగ్జిబిటర్లు- డిస్ట్రిబ్యూటర్లు కలిసి కుదుర్చుకున్న ఒప్పందం టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. ప్రస్తుతానికి ఎవరూ పైకి ఏమీ అనడం లేదు కానీ, నిర్మాతలు…

రెంట్ సిస్టమ్‌కు బదులుగా షేరింగ్ మీద సినిమాలు ఆడేలా తెలంగాణ ఎగ్జిబిటర్లు- డిస్ట్రిబ్యూటర్లు కలిసి కుదుర్చుకున్న ఒప్పందం టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. ప్రస్తుతానికి ఎవరూ పైకి ఏమీ అనడం లేదు కానీ, నిర్మాతలు మాత్రం ఈ అగ్రిమెంట్ పట్ల అసంతృప్తిగానే వున్నారు. అయితే ప్రస్తుతానికి ఇది నైజాం ఏరియాలో మాత్రమే. అక్కడి బలమైన ఎగ్జిబిటర్లు సునీల్, శిరీష్ వుండడంతో ఇది సాధ్యమైంది.  కానీ నిర్మాతలకు ఈ అగ్రిమెంట్ ఏమంత అంగీకారంగా లేదని తెలుస్తోంది. అయితే అమలు జరిగినపుడు కదా అనే ధీమాతో వున్నారు.

ఇక్కడ సమస్య ఏమిటంటే సినిమాను ఎన్ ఆర్ ఐ చేస్తేనే. విడుదల అయితే బయ్యర్లకు పోయింది ఏమీ లేదు. నిర్మాతలకే సమస్య. అందుకే బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ఒక్కటై ఇలాంటి అగ్రిమెంట్ తెచ్చారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే నైజాంలో ఎక్కువ సినిమాలు పంపిణీనే కానీ, ఎన్ ఆర్ ఐ చేసేవి తక్కువు అంటే ఈ అగ్రిమెంట్ వల్ల బయ్యర్లకు లేదా డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు నష్టం లేదు.

పైగా చిన్న సినిమాలు ఆడేదే ఒక వారం, మహా అయితే మరోవారం. కానీ వాటి ఆదాయంలో సగానికి సగం ఎగ్జిబిటర్లు తీసేసుకుంటే ఇక నిర్మాతల పరిస్థితి ఏమిటి? పైగా ఆ సినిమాలు అన్నీ నైజాంలో జస్ట్ పంపిణీనే. ఇటు రెంట్లు భరించలేము అనుకుంటే సగానికి సగం పంపిణీ, తొలివారం తరువాత టాక్ కాస్త వచ్చింది అనుకుంటే మరి కాస్త కలిపి మళ్లీ ఎగ్జిబిటర్ కే వెళ్లిపోతుంది.

ఎగ్జిబిటర్లు ఖర్చులు పెరిగిపోయాయి కనుక తమకు ఇది తప్పదు అంటున్నారు. నిర్మాతలు- బయ్యర్లు- ఎగ్జిబిటర్లు కలిసి కూర్చుని అగ్రిమెంట్ వరకు వస్తే వేరుగా వుండేది. కానీ అటు ఎగ్జిబిటర్లుగా ఇటు బయ్యర్లుగా డ్యూయల్ రోల్స్ వున్న సునీల్, శిరీష్ లాంటి వారి ఆధ్వర్యంలో అగ్రిమెంట్ జరగడం సరికాదని కొందరు నిర్మాతలు కామెంట్ చేస్తున్నారు.

పైగా ఈ ఇద్దరు తీసుకున్న ఇండియన్ 2, గేమ్ ఛేంజర్, కల్కి సినిమాలకు ఈ అగ్రిమెంట్లతో సంబంధం లేదని అనడం మరీ చిత్రంగా వుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.