Advertisement

Advertisement


Home > Movies - Movie News

అలీకి ఏమైంది.. ఎందుకు తట్టుకోలేకపోతున్నాడు?

అలీకి ఏమైంది.. ఎందుకు తట్టుకోలేకపోతున్నాడు?

ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడిదే చర్చ. రివ్యూల్ని, రాసినోళ్లని తిట్టడం ఫ్యాషన్ అయిపోయిన ఈ రోజుల్లో అలీ కూడా ఆ గ్యాంగ్ లోకి చేరిపోయాడు. తనకు సంబంధం లేకపోయినా, తన సినిమా కాకపోయినా, తను డబ్బులు పెట్టి సినిమా తీయకపోయినా రాజుగారి గది-3ని వెనకేసుకొని రావడం కోసం సమీక్షకుల్ని తిట్టిపోశాడు.

"కొంతమంది పనిగట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నారు. సినిమా బాగాలేదు, పెద్దగా లేదు, ఏదో అనుకున్నాం, ఏదో ఆశించాం అంటున్నారు. మీరెవరు చెప్పడానికి కోంకిస్కా గొట్టం గాళ్లు. మిమ్మల్ని నమ్ముకొని మేం ఇండస్ట్రీకి రాలేదు. ప్రేక్షకుల్ని నమ్ముకొని వచ్చాం. ఎవర్ని ఎక్కడ పెట్టాలో ప్రేక్షకులకు బాగా తెలుసు. మధ్యలో మీకెందుకు."

సినిమాపై వచ్చిన నెగెటివ్ రివ్యూస్ పై అలీ ఇలా పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. రివ్యూల మీద సరైన అభిప్రాయం లేకనే, అలాంటి షోలు చూడ్డానికి వెళ్లడం లేదని, ప్రేక్షకులతో కలిసి సినిమాలు చూస్తున్నానని అన్నాడు అలీ. రివ్యూ షోలకు వెళ్లినప్పుడు మంచి కామెడీ సీన్ వచ్చినా చాలామంది నవ్వరని, మనస్ఫూర్తిగా నవ్వాలని అనిపించినా ముభావంగా నవ్వుతారని విమర్శించాడు.

దాదాపు 4 దశాబ్దాలుగా పరిశ్రమలో కొనసాగుతున్న అలీ.. ఎప్పుడూ ఇలా రివ్యూయర్స్ పై ఫైర్ అవ్వలేదు. పైపెచ్చు సమీక్షల్ని, సమీక్షకుల్ని మెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సమీక్షల ద్వారా తమని తాము సంస్కరించుకుంటామని, సమీక్షలు లేకపోతే చెత్త సినిమాలు వస్తాయని ఇదే అలీ గతంలో అన్నారు. అంతెందుకు.. తన ఆత్మబంధువు, ప్రాణస్నేహితుడు పవన్ కల్యాణ్ సినిమాల్ని రివ్యూల్లో ఏకిపడేసినప్పుడు కూడా అలీ ఇంతలా రియాక్ట్ అవ్వలేదు.

ఇప్పుడు రాజుగారి గది3 విషయంలో మాత్రం అలీ ఇలా ఓవర్ గా రియాక్ట్ అయి విమర్శల పాలవుతున్నాడు. ఇది నిజంగానే రాజుగారి గది 3 మీద అనురాగమా లేక తాజాగా తను హీరోగా నటించిన సినిమాను తొక్కేశారనే బాధో అర్థంకావడం లేదు. అన్నట్టు ఇలాంటి విమర్శలు చాలా చూశానని, వాటిని అలా దులిపేసుకొని వెళ్లిపోవాలంటూ అశ్విన్ కు ఓ ఉచిత సలహా కూడా పడేశాడు అలీ.

పంచాయతీలలో చంద్రబాబు నిష్ణాతుడే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?