గ్లామర్ తో పాటు వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ సినీ రంగంలో రాణిస్తూన్న స్టార్ హీరోయిన్ అలియా భట్ వ్యాపార రంగంలోనూ దూసుకెళుతోంది. మొదట్లో ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ వచ్చిన ఆమె.. 2022లో గర్భవతిగా ఉన్నప్పుడు ఎడ్-ఎ-మామా పేరిట దుస్తుల విక్రయం మొదలుపెట్టింది.
ఒక సంవత్సరంలోనే కంపెనీ ఇప్పటికే రూ.150 కోట్ల వాల్యుయేషన్‌ను తాకింది. 12 నెలల్లో కంపెనీ 10 రెట్లు వృద్ధిని సాధించింది. కంపెనీ 2-14 సంవత్సరాల వయస్సు పిల్లలకు బట్టలు విక్రయిస్తుంది. కంపెనీ తన వెబ్‌సైట్‌లో దాదాపు 800 వస్తువులను అందుబాటులో ఉంచింది.
అలియా మాట్లాడుతూ.. వ్యాపారాన్ని నిర్వహించడం గురించి తాను ఇంకా నేర్చుకుంటున్నానని కేవలం ఏడాది వ్యవధిలో సంస్థ సాధించిన ఘనత తనకు గర్వకారణంగా ఉందన్నారు. “చిన్న కలగా మొదలైనది ఇప్పుడు 150 కోట్ల వ్యాపారంగా మారుతోంది” అని సంతోషాన్ని వ్యక్తం చేసింది.
అలియా భట్.. రణ్ బీర్ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ జంట పెళ్లైన కొన్ని నెలలకే తల్లిదండ్రులుగా మారారు. రాహా అనే కూతురుకు జన్మనిచ్చింది ఆలియా. నిన్నటి రోజునే అలియా భట్ తన 30వ పుట్టినరోజు జరుపుకుంది.