బాబోయ్! చంద్రబాబుని మించిన అబద్ధాలకోరు

అబద్ధమాడడం ముమ్మాటికీ తప్పు. కానీ దానికీ కాస్తంత మినహాయింపుని ఇచ్చారు. మానం కానీ, ప్రాణం కానీ పోతున్నప్పుడు అబద్ధమాడినా తప్పులేదని లోకోక్తి. అయినప్పటికీ కొందరికి అబద్ధాలాడడం నిత్యకృత్యం. వీళ్లనే హేబిచువల్ లయ్యర్స్ అంటారు. అవసరమున్నా…

అబద్ధమాడడం ముమ్మాటికీ తప్పు. కానీ దానికీ కాస్తంత మినహాయింపుని ఇచ్చారు. మానం కానీ, ప్రాణం కానీ పోతున్నప్పుడు అబద్ధమాడినా తప్పులేదని లోకోక్తి. అయినప్పటికీ కొందరికి అబద్ధాలాడడం నిత్యకృత్యం. వీళ్లనే హేబిచువల్ లయ్యర్స్ అంటారు. అవసరమున్నా లేకపోయినా, మానప్రాణాలకి ముప్పు లేకపోయినా అబద్ధాలాడేయడం వీళ్ల నైజం. మరీ ముఖ్యంగా ఈ అబద్ధాల్లో సొంతడబ్బాయే ఎక్కువుంటుంది కొందరికి. 

తెలుగువాళ్లందరికీ చంద్రబాబు ఏ స్థాయి అబద్ధాలకోరో తెలుసు. హైటెక్ సిటీ నేదురుమల్లి మొదలుపెడితే తాను మొదలెట్టానని చరిత్ర రాయించుకున్నాడు. మొబైల్ ఫోన్లు ఇండియాకు తానే తెచ్చానంటాడు. అమెరికాలో తెలుగు ఎన్నారైలు స్థిరపడ్డారంటే అదంతా తన చలవే అంటాడు. వర్క్ ఫ్రం హోం ప్రవేశపెట్టింది కూడా తానే అని చెప్పుకుంటాడు. వీటికి తోడు అతి పెద్ద అబద్ధం అమరావతి. ఎప్పటికీ కార్యరూపం దాల్చని ఒక భ్రమని గ్రాఫిక్స్ లో చూపించి అదిగో అలా అవుతోంది ఈ ఊరు అంటూ కట్టుకథ చెప్పాడు. అందుకే దానిని భ్రమరావతి అన్నారు ప్రజలు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుని ఎవ్వరూ కొట్టలేరన్న ఖ్యాతి పొందాడు. 

కానీ తనని మించిపోయాడు తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్. ఆర్నెల్ల సావాసం వల్ల వాళ్లు వీళ్లౌతారంటారు. అదే జరిగిందో లేక సహజంగా అబద్ధాల జబ్బు ఎప్పుడో దాపురించిందో కానీ మరీ నరం లేకుండా అసత్యాలు పలకడం విడ్డూరంగా ఉంది. 

అప్పట్లో తాను ఇంటర్లో చదివిన గ్రూప్ ఎం.ఇ.సి అని ఒకసారి, ఎం.పి.సి మరొసారి, ఇంకోటేదో అని వేరే సారి చెప్పాడు. 

ఒకసారి తనకి ఈఎమ్మైలు కట్టుకోవడానికి డబ్బుల్లేవంటాడు, ఒకసారి తాను చూడని డబ్బా పొందని భోగాలా అంటాడు. ఒక్కోసారి పేదవాడి ఆకలి తెలియడానికి ఒక్కపూటే భోజనం చెస్తున్నానంటాడు. మరొకసారి ఇంకోటేదో చెప్తాడు. అతని అబద్ధాల లిస్టు చేస్తే చాలా పొడవుంటుంది. 

ఇప్పుడు లేటెస్ట్ గా వంగవీటి మోహనరంగా పేరు ప్రస్తావించి అభాసుపాలయ్యాడు. రంగా అప్పట్లో తన ఇంటికి వచ్చాడని, స్వయంగా తానే టీ ఇచ్చానని చెప్పుకున్నాడు నిన్నటి బందరు సభలో. అది అబద్ధమని తేలడానికి ఒక్కపూట పట్టలేదు. 2021లో ఒక సభలో తాను రంగాని ఒక్కసారి దూరం నుంచి చూశాను తప్ప ఎప్పుడూ కలవలేదని చెప్పాడు. అయితే ఏది అబద్ధమో తేలేలోపు ఇందులో మరొక శుద్ధ అబద్ధం బయటపడింది. మోహనరంగా మిత్రుడైన తిలక్ అనే వ్యక్తి, “అసలు రంగాగారు కాఫీ టీలు తాగేవాడే కాదు. కేవలం పాలు తాగేవాడు” అని చెప్పిన వీడియో బైట్ చక్కర్లు కొడుతోంది. 

ఇలా ఆద్యంతం అభాసుపాలు కావడమే పవన్ వంతు అవుతోంది. తనకి బాబులాగ మతిమరుపు జబ్బైనా వచ్చుండాలి లేక అబద్ధాల వ్యాధైన ముదిరుండాలి. ఇలాంటి అవకతవక నాయకుడ్ని పట్టుకుని ముందుకెళ్లడమంటే కుక్కతోక పట్టుకుని సముద్రాన్ని ఈదినట్టే. 

ఒకసారి తనకి కులాలు లేవంటాడు. మరోసారి తాను కాపునని, మరో సందర్భంలో తన తల్లి బలిజ కనుక తాను బలిజనని, జంధ్యం వేసుకున్నాను కనుక బ్రాహ్మణుడినని, ఇంకోటేదో కారణం వల్ల రెల్లి కులస్థుడినని చెప్పాడు. అంటే తనని ముఖ్యమంత్రిని చేస్తే ఈ కులాలవాళ్లందర్నీ ముఖ్యమంత్రి చేసినట్టే అని సామాజిక న్యాయ సూత్రం చెప్తాడో ఏమో. వట్టి దగుల్బాజీతనం కాకపోతే ఏమిటిదంతా!? ఇంతకీ పవన్ కులమేంటి? ఏది నిజం? 

పూటకో వేషం, తేపకో కులం పేరు చెప్పుకుంటూ, తాను కులాల్ని నమ్మనని చెప్పిన మరుక్షణమే కాపులందరూ కమ్మలతో కలవాలని పిలుపివ్వడం..ఇదంతా బుర్రపెట్టి వినేవాడికి పిచ్చాసుపత్రి పేషెంట్ వాగుడుని వింటున్నట్టు ఉండదూ! “ఓయ్! నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమౌతోందా” అని అరవాలనిపించదు! 

అయితే అబద్ధాలు, లేకపోతే పొంతనలేని పిచ్చివాగుడు తప్ప నిర్మాణాత్మకంగా ఏదైనా మాట్లాడతాడా అంటే ఏదీ ఉండదు. 

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక అభిప్రాయం చూడండి: “రెడ్లని దింపడానికి కాపులు, కమ్మలు ఐక్యమవ్వాలంటున్నాడు. రంగా కాపు, రత్నకుమారి కమ్మ కాబట్టి మన కాపులకి కమ్మవారితో ద్వేషం వద్దని పరోక్ష సందేశం ఇచ్చాడు. ఓకే. మరి తన ఇంట్లోనే రామచరణ్ కాపు- ఉపాసన రెడ్డి, అల్లు అర్జున్ కాపు- స్నేహా రెడ్డి కదా! మరి రెడ్ల మీద ద్వేషమెందుకు?”

ఇలాంటి ప్రశ్నలు అడిగి సమాధానాలు ఆశించడం అనవసరం. అబద్ధాలకోరుకి నిబద్ధత ఉండదు. అన్సర్ లేకపోతే నేనలా అనలేదని అబద్ధాలు కూడా ఆడొచ్చు! ఈ వ్యక్తిని అస్సలు నమ్మలేం. పాపం జనసైనికులు, వీరమహిళలు..ఎప్పుడు తెలుసుకుంటారో. 

దుక్కిపాటి సుందర్