ఈ సమ్మర్ సీఙన్ లో స్టార్టింగ్ మూవీ దసరా. దాదాపు రెండు నెలలుగా సరైన సినిమా లేక టాలీవుడ్ డల్ గా వుంది. ఇలాంటి టైమ్ లో వస్తోంది దసరా.
హీరో నాని కెరీర్ లోనే 80 కోట్లు హయ్యస్ట్ బడ్ఙెట్ తో తయారైన సినిమా.కొత్త దర్శకుడు ఓదెల శ్రీకాంత దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్. చెరుకూరి సుధాకర్ నిర్మాత.
పాన్ ఇండియా సినిమా కావడంతో చాలా త్వరగానే సెన్సారు చేయించారు. చిన్నచిన్న పదాలు మ్యూట్ చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. అవి ఫుల్ పిల్ చేస్తే య/ఎ సర్టిఫికెట్ ఇస్తారు.
గోదావరి ఖని బొగ్గు గనుల వద్ద వున్న ఓ చిన్న విలేఙ్ నేపథ్యంలో అల్లుకున్న అత్యంత సహఙమైన పగలు..ప్రతికారాల కథతో దసరా సినిమాను రూపొందించారు.
గ్రామంలో వున్న రావణాసురుడిని వధించిన రాముడి కథ ఇది. సినిమా గ్రాండియర్, మేకింగ్, టెక్నికల్ వాల్యూస్ చూసి సెన్సారు సభ్యులు నిర్మాతకు మంచి ప్రశంసలు అందించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ వర్క్ సాగుతోంది. నాని బెంగుళూరులో వున్నారు. దాని తరువాత అహమ్మదాబాద్, నాగపూర్ తదితర ప్రాంతాలకు వెళ్తారు. నిన్న ట్రయిలర్ ను విడుదల చేసారు. దానికి మంచి అప్లాఙ్ వచ్చింది.