నెగెటివ్ అనిపించుకుంటే ఆ కిక్కే వేరప్పా!

పాజిటివ్ అనే పేరు వినిపిస్తే చాలు భయపడే రోజులివి. ఇలాంటి టైమ్ లో నెగెటివ్ అనే పేరు వింటే ఆ కిక్కే వేరప్పా అంటోంది బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. కరోనాతో బాధపడుతూ ఇన్నాళ్లు…

పాజిటివ్ అనే పేరు వినిపిస్తే చాలు భయపడే రోజులివి. ఇలాంటి టైమ్ లో నెగెటివ్ అనే పేరు వింటే ఆ కిక్కే వేరప్పా అంటోంది బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. కరోనాతో బాధపడుతూ ఇన్నాళ్లు హోం క్వారంటైన్ లో ఉన్న ఈ చిన్నది, ఇప్పుడు బయటకొచ్చింది. 

తాజాగా నిర్వహించిన కరోనా టెస్ట్ లో తనకు నెగెటివ్ వచ్చిన విషయాన్ని బయటపెట్టింది. “నెగిటివ్ కూడా మంచిదని అనిపించుకునే ఒకే ఒక్క టైమ్ ఇదే”నంటూ ఓ చిన్న క్యాప్షన్ కూడా పెట్టింది.

అలియా భట్ కంటే ముందు ఆమె బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ కరోనా బారిన పడ్డాడు. ఆ టైమ్ లోనే అంతా అలియాభట్ పై అనుమానం వ్యక్తంచేశారు. ఆ అనుమానాల్ని నిజం చేస్తూ.. తనకు కూడా కరోనా సోకినట్టు అలియాభట్ ప్రకటించింది. హోం ఐసొలేషన్ లో ఉన్నప్పటికీ మధ్యమధ్యలో తన సెల్ఫీలతో అభిమానుల్ని పలకరిస్తూనే ఉంది.

అలా 12 రోజులుగా హోం క్వారంటైన్ లో ఉన్న అలియాభట్ ఇప్పుడు బాహ్యప్రపంచంలోకి రాబోతోంది. తిరిగి షూటింగ్స్ తో బిజీ అవ్వబోతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు బ్రహ్మాస్త్ర మూవీ ఉంది. ఆమె నటించిన మరో మూవీ గంగూభాయ్ కతియావాడీ విడుదలకు సిద్ధమైంది. అలియాభట్ కు నెగెటివ్ రావడంతో ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కు లైన్ క్లియర్ అయింది.