ఆర్ఆర్ఆర్ లో అలియా భట్ ఉన్నట్టా.. లేనట్టా!

ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ సెట్స్ పైకి రాలేదు అలియాభట్. దీంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు 2 రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఓ సెక్షన్ మీడియా అయితే మరో హీరోయిన్ కోసం రాజమౌళి అప్పుడే…

ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ సెట్స్ పైకి రాలేదు అలియాభట్. దీంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు 2 రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఓ సెక్షన్ మీడియా అయితే మరో హీరోయిన్ కోసం రాజమౌళి అప్పుడే సెర్చింగ్ మొదలుపెట్టాడంటూ కథలు అళ్లేసింది. దీంతో ఆర్ఆర్ఆర్ యూనిట్ మరోసారి రంగంలోకి దిగింది. తమ సినిమాలో అలియా భట్ ఉందంటూ క్లారిటీ ఇచ్చింది.

రాజమౌళి ఎప్పుడు కోరితే అప్పుడు సెట్స్ పైకి రావడానికి అలియా భట్ సిద్ధంగా ఉందట. నిజానికి ఈ వారం రోజుల్లో ఆమె సెట్స్ పైకి రావాల్సి ఉంది. కరోనా కారణంగా షూటింగ్ ను నిలిపివేయడంతో అలియా రాక సాధ్యం కాలేదు. షూటింగ్ విషయంలో రాజమౌళి ప్రత్యామ్నాయం కోసం కూడా చూశాడు కానీ కుదరలేదు.

తాజా సమాచారం ప్రకారం.. ఏప్రిల్ లేదా మే నెలలో ఆర్ఆర్ఆర్ సెట్స్ పైకి అలియా భట్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ చేసే పనిలో రాజమౌళి ఉన్నాడట. ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించనుంది అలియా. అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ కు లవర్ గా నటించనుంది.

లెక్కప్రకారం, ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ఏడాది కిందట పూణె షెడ్యూల్ లో అలియాభట్ జాయిన్ అవ్వాల్సి ఉంది. కానీ అదే షెడ్యూల్ లో రామ్ చరణ్, జిమ్ లో ఎక్సర్ సైజులు చేస్తూ తీవ్రంగా గాయపడ్డంతో ఆ షెడ్యూల్ మొత్తం కాన్సిల్ అయింది. అప్పట్నుంచి ఇప్పటివరకు మళ్లీ సెట్స్ పైకి రాలేదు అలియా. దీంతో పుకార్లు ఊపందుకున్నాయి. తాజాగా యూనిట్ క్లారిటీ ఇవ్వడంతో ఈ రూమర్లకు చెక్ పడింది.

కేసీఆర్ బతికున్నంత వరకూ ఏ కష్టం రాదు