ప్రారంభమైనప్పట్నుంచి ఏదో ఒక రూపంలో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. షూటింగ్ ఆలస్యమౌతూనే ఉంది. తాజాగా ఈ ప్రాజెక్టుకు మరో చిన్న ఎదురుదెబ్బ తగిలింది. సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అలియాభట్ కరోనా బారిన పడింది.
“నాకు కరోనా సోకింది. వెంటనే నేను హోం ఐసొలేషన్ లోకి వెళ్లిపోయాను. అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాను”
ఇలా తనకు కరోనా సోకిన విషయాన్ని అలియాభట్ బయటపెట్టింది. లెక్కప్రకారం ఈ నెలలో ఆమె ఆర్ఆర్ఆర్ సెట్స్ పైకి రావాలి. కరోనా సోకడంతో ఈ సినిమా షెడ్యూల్ మరోసారి వాయిదాపడేలా ఉంది.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది అలియాభట్. ఆ టైమ్ లోనే భన్సాలీ కూడా కరోనా బారిన పడ్డాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు అలియా బాయ్ ఫ్రెండ్ రణబీర్ కు కూడా కరోనా వైరస్ సోకింది. వాళ్లిద్దరూ కోలుకున్న టైమ్ కు అలియాభట్ కు కరోనా సోకింది.
ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది అలియాభట్. సినిమాలో ఆమె పాత్ర పేరు సీత. ఆ ఫస్ట్ లుక్ ను కూడా తాజాగా రివీల్ చేశారు.