cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఫిబ్రవరిలో పెళ్లి.. ఏప్రిల్ లో ప్రెగ్నెన్సీ

ఫిబ్రవరిలో పెళ్లి.. ఏప్రిల్ లో ప్రెగ్నెన్సీ

మొన్న ఫిబ్రవరిలో రెండో పెళ్లి చేసుకుంది హీరోయిన్ దియా మీర్జా. ఇప్పుడు తను గర్భవతి అనే విషయాన్ని ప్రకటించింది. ఫిబ్రవరి 15న దియా-వైభవ్ రేఖి పెళ్లితో ఒకటయ్యారు. ఆ తర్వాత మాల్దీవులకు కూడా వెళ్లొచ్చారు. ఇప్పుడు తను గర్బంతో ఉన్నట్టు దియా ప్రకటించడమే కాకుండా.. అందుకు సంబంధించిన ఫొటోను కూడా పోస్ట్ చేసింది.

రీసెంట్ గా వైల్డ్ డాగ్ సినిమా ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చింది దియా మీర్జా. మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. ఆ టైమ్ లోనే దియా డ్రెస్సింగ్ స్టయిల్ చూసి చాలామంది అనుమానించారు. ఇప్పుడు ఆ ఊహాగానాల్ని నిజం చేస్తూ తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని బయటపెట్టింది దియా.

గతంలో సాహిల్ సంఘాను పెళ్లాడింది దియా. 11 ఏళ్లు కాపురం చేసిన తర్వాత వాళ్లిద్దరూ విడిపోయారు. అలా విడిపోయిన ఏడాది గ్యాప్ లోనే.. వైభవ్ తో డేటింగ్, పెళ్లి, గర్భం దాల్చడం చకచకా జరిగిపోయాయి.

ఆమె నటింటిన వైల్డ్ డాగ్ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. సినిమాలో నాగార్జునకు భార్యగా నటించింది దియా.

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×