Advertisement

Advertisement


Home > Movies - Movie News

సుశాంత్ సెగ అలియాకు గట్టిగా తగిలింది

సుశాంత్ సెగ అలియాకు గట్టిగా తగిలింది

సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ అంతా అట్టుడికిపోతోంది. ఇంకా చెప్పాలంటే సుశాంత్ సూసైడ్ తర్వాత బాలీవుడ్ లో స్పష్టంగా రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఇదే క్రమంలో నెపొటిజం/బంధుప్రీతిపై ఓ స్థాయిలో చర్చ ఊపందుకుంది. నటవారసులుగా ఇండస్ట్రీలోకి వచ్చిన స్టార్స్ అందరూ సోషల్ మీడియాలో ఆ సెగ చూశారు. వాళ్ల ఫాలోవర్స్ సంఖ్య లక్షల్లో తగ్గిపోయింది. అయితే అందరికంటే ఎక్కువగా ఈ సెగ అలియాభట్ ను తాకింది.

సడక్-2 అనే సినిమా చేస్తోంది అలియా భట్. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశారు. సుశాంత్ మరణించిన రోజు నుంచి నెపోకిడ్స్ పై గుర్రుగా ఉన్న జనాలు, ఆ కోపం మొత్తాన్ని అలియాభట్ సడన్-2 ట్రయిలర్ పై చూపించారు. ఊహించని విధంగా ఈ ట్రయిలర్ కు 50 లక్షల డిస్-లైక్స వచ్చాయి. అది కూడా కేవలం 24 గంటల్లో.

ఇప్పటికీ ఈ ట్రయిలర్ కు గంటగంటకు డిస్-లైక్స్ పెరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లో ఈ డిస్ లైక్స్ సంఖ్య 60 లక్షలకు కూడా చేరబోతోంది. అటు ఈ ట్రయిలర్ కు లైక్స్ మాత్రం కేవలం 3 లక్షల 15వేలు మాత్రమే (ప్రస్తుతానికి) వచ్చాయి. ఇలా అలియాభట్ కు సుశాంత్ సెగ గట్టిగా తగిలింది.

నిజానికి నెటిజన్లంతా అలియానే టార్గెట్ చేయడానికి ఓ రీజన్ ఉంది. తన కెరీర్ స్టార్టింగ్ లో సుశాంత్ పై కొన్ని అభ్యంతరక వ్యాఖ్యలు చేసింది అలియా. సుశాంత్ హీరోగా హిట్స్ కొడుతున్న టైమ్ లో.. "మేఘాలు వస్తుంటాయి పోతుంటాయి" అనే అర్థం వచ్చేలా విమర్శలు చేసింది. సుశాంత్ మరణించిన తర్వాత ఆ వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవ్వడంతో.. ఆ ప్రభావం అలియా నటించిన సడక్-2 ట్రయిలర్ పై ప్రత్యక్షంగా పడింది.

సుశాంత్ మరణం తర్వాత చాలామంది నెపోకిడ్స్ (వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చిన నటీనటులు) తమ సోషల్ మీడియా యాక్టివిటీ తగ్గించేశారు. కొంతమంది కామెంట్స్ భరించలేక ఛాట్ సెషన్ ను డిసేబుల్ చేశారు. ఇప్పుడు అలియా బుక్ అయింది. రాబోయే రోజుల్లో ఇంకెంతమందికి ప్రేక్షకుల నుంచి ఈ నిరసన సెగ తగులుతుందో చూడాలి. అన్నట్టు ఇండియాలో మోస్ట్ డిస్-లైక్డ్ (ఎక్కువమంది ఇష్టపడని) ట్రయిలర్ గా ఇది రికార్డ్ సృష్టింది. 

కర్నూలు వైరస్ కథ

మెగా రెమ్యూనిరేషన్?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?