ఇంద్రగంటి డైరక్షన్ లో దిల్ రాజు నిర్మించిస థ్రిల్లర్ వి. ఈ సినిమా ఓటిటికి వస్తుందన్న వార్తలు గతకొద్ది రోజులుగా ఊపందుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో హీరో నాని ఒప్పుకోవడం లేదన్న ఫేక్ గ్యాసిప్ లు కూడా వినిపించాయి. కానీ హీరో సన్నిహిత వర్గాల బోగట్టా ప్రకారం, ఓటిటి విడుదలకు హీరో నానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలుస్తోంది.
మొదటి నుంచీ నాని ఒకటే స్టాండ్ మీద వున్నారట. అక్టోబర్ వరకు చూడండి…అప్పటికీ వీలు కాకపోతే ఓటిటికి వెళ్లిపోవడమే అన్నది ఆయన సలహా. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అలాగే వున్నాయి. అక్టోబర్ నెలాఖరులో దసరా వుంది. కానీ అప్పటికి థియేటర్లు ప్రారంభం అవుతాయన్న ఆశ కనిపించడం లేదు. పైగా ఇలా స్టార్ట్ కాగానే అలా జనం వచ్చేస్తారన్న ఆలోచన కూడా లేదు.
అందువల్ల ఓటిటి ఫ్లాట్ ఫారమ్ లో విడుదల చేయడానికి ఇక హీరో నానికి ఏ అభ్యంతరం లేదని తెలుస్తోంది. ఎందుకంటే 40 కోట్ల పెట్టుబఢి అలా వుండిపోవడం అన్నది నిర్మాత యాంగిల్ లో కూడా ఆలోచించాలి కదా? అందుకే హీరో నాని సినిమా విడుదల పై డెసిషన్ ను పూర్తిగా నిర్మాత దిల్ రాజుకే వదిలేసినట్లు తెలుస్తోంది.