అచ్చెన్నకు కరోనా.. లోకేష్ పిచ్చి లాజిక్

మాజీ మంత్రి, ఈఎస్ఐ కుంభకోణం కేసులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న అచ్చెన్నాయుడికి కరోనా సోకింది. ఈ వార్త పచ్చ మీడియాలో చక్కర్లు కొట్టడం ఆలస్యం ఎల్లో బ్యాచ్ రంగంలోకి దిగింది. అచ్చెన్న కరోనాకీ…

మాజీ మంత్రి, ఈఎస్ఐ కుంభకోణం కేసులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న అచ్చెన్నాయుడికి కరోనా సోకింది. ఈ వార్త పచ్చ మీడియాలో చక్కర్లు కొట్టడం ఆలస్యం ఎల్లో బ్యాచ్ రంగంలోకి దిగింది. అచ్చెన్న కరోనాకీ జగన్ కక్షసాధింపే కారణమంటూ లింకులు వెదికింది. స్వయంగా నారా లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్లో అచ్చెన్న కరోనాకి కారణం జగనేనంటూ పరోక్షంగా కామెంట్లు వదలడం పచ్చ రాజకీయం కాక ఇంకేంటి?

ఆపరేషన్ అయిందని తెలిసి కూడా కక్షసాధింపు కోసం అచ్చెన్నాయుడిని జగన్ వేధించారని, ఆయనిప్పుడు కరోనాబారిన పడ్డారని తెగ సింపతీ కురిపించారు లోకేష్. అసలు అచ్చెన్నాయుడికి కొవిడ్ పాజిటివ్ రావడానికి, జగన్ కి ఏమైనా సంబంధం ఉందా? రిమాండ్ లో ఉన్న ఖైదీ జైల్లో ఉండకుండా.. అనారోగ్యం సాకు చెప్పి ఆస్పత్రుల వెంట తిరిగారు. అసలే ఆస్పత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోయి ఉన్నాయి. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు తనకు తానే కరోనాని వెతుక్కుంటూ వెళ్లినట్టయింది.

అలాంటి అచ్చెన్నాయుడిపై సింపతీ చూపిస్తూ దానికి కారణం జగన్ అని చెప్పడం ఎంతవరకు సమంజసం. ఆ లెక్కన చూస్తే.. వైసీపీలో చాలామందికి కరోనా సోకింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కరోనా బారిన పడ్డారు. మరి వారిపై కూడా జగన్ కక్షసాంధింపుకి పాల్పడినట్టేనా. సొంత ఎమ్మెల్యేలు, ఎంపీలకు కరోనా రావడానికి కూడా జగనే కారణమా?

లాజిక్ లేకుండా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు కాబట్టే నారా లోకేష్ అందరికీ అలుసైపోయారు. అచ్చెన్నపై అంత సింపతీ ఉంటే.. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని దేవుడికి దణ్ణం పెట్టుకోవాలి కానీ, జగన్ పై పడి ఏడిస్తే ఏం లాభం. పోనీ అచ్చెన్నపై కేసు పెట్టకుండా ఉంటే, ఆయన ఇంట్లోనే ఉండి ఉంటే కరోనా బారిన పడకుండా ఉంటారని లోకేష్ ఏమైనా గ్యారెంటీ ఇవ్వగలరా?

మంత్రిగా తప్పులు చేసి, మందుల కొనుగోళ్లలో వాటా కాజేసి కేసులు ఎదుర్కుంటున్న నిందితుడు అచ్చెన్న. అలాంటి వ్యక్తిని వెనకేసుకు రావాల్సిన దౌర్భాగ్యం టీడీపీ నాయకులది. చివరికి ఇప్పుడు అచ్చెన్న కరోనాని కూడా రాజకీయం చేయడం లోకేష్ కి, టీడీపీ జనాలకే చెల్లింది.

కర్నూలు వైరస్ కథ

సినిమా ప్లాప్ అయితే అంతే