మొన్నటివరకు టాలీవుడ్ మేకర్స్ కు ఓ ధైర్యం ఉండేది. తమ సినిమా థియేట్రికల్ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ, నాన్-థియేట్రికల్ విభాగంలో ఓటీటీ రైట్స్ మాత్రం మంచి రేటుకు అమ్ముడుపోతాయనే నమ్మకం ఉండేది. చిన్న నిర్మాతల నుంచి మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాతల వరకు అందరికీ ఇదే ఆసరా. కానీ ఇకపై అలా నమ్మకం పెట్టుకుంటే కుదరదు. ఓటీటీలు కూడా వెనక్కి తగ్గుతున్నాయి. ఇది తెలుగు సినిమాకు పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి.
ఇన్నాళ్లూ ఓటీటీలన్నీ ఇబ్బడిముబ్బడిగా డబ్బు ఖర్చు పెట్టాయి. కంటెంట్ ను పెంచుకోవడమే లక్ష్యంగా కోట్లు కుమ్మరించాయి. కానీ ఇప్పుడా సంస్థలన్నీ తమ బిజినెస్ ప్లాన్ మార్చాయి. ఇన్నాళ్లూ తమ ఫ్లాట్ ఫామ్ పై పెట్టిన కంటెంట్ తో ఇప్పుడు లాభాలు ఆశిస్తున్నాయి. ఇందులో భాగంగా నెట్ ఫ్లిక్స్, డిస్నీ లాంటి సంస్థలు తమ కంటెంట్ బడ్జెట్ తగ్గించాయి.
డిస్నీ హాట్ స్టార్ సంస్థ అయితే ఈసారి ఏకంగా తమ కంటెంట్ బడ్జెట్ లో ఏకంగా 100 కోట్ల డాలర్ల కోత విధించింది. అంతర్జాతీయ స్థాయిలో కంటెంట్ క్రియేట్ చేసే ఈ మెగా సంస్థ, ఇకపై ఒరిజినల్ మూవీస్ వెబ్ సిరీస్ విషయంలో వెనక్కు తగ్గాలని నిర్ణయించుకుంది. నేరుగా సినిమాలు కొని స్ట్రీమింగ్ కు పెట్టాలనే అంశంపై ఈ కంపెనీది మొదటి నుంచి వెనకడుగే.
ఇక నెట్ ఫ్లిక్స్ కూడా తమ కంటెంట్ బడ్జెట్ ను మెల్లమెల్లగా తగ్గించుకుంటోంది. డిస్నీ స్థాయిలో కాకపోయినా, ఇండియాలో రీజనల్ కంటెంట్ బడ్జెట్ లో కనీసం 50శాతం కోత విధించే అవకాశం కనిపిస్తోంది. ఉన్న కంటెంట్ తోనే సబ్ స్క్రైబర్లను పెంచుకునే యోచనలో ఆ సంస్థ ఉంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోస్ గురించి అందరికీ తెలిసిందే. రీజనల్ కంటెంట్ ఎక్విజిషన్ విషయంలో టాప్ లో ఉన్న ఈ సంస్థ, దొరికిన ప్రతి సినిమాను కొని పడేసింది. చిన్న సినిమాలకు పెద్ద వరంగా మారింది. కానీ కొన్ని రోజులుగా చిన్న సినిమాలపై ఈ సంస్థ ఆసక్తి చూపించడం లేదు. దీనికితోడు పే పర్ వ్యూ (వీక్షణల బట్టి డబ్బు ఇచ్చే పద్ధతి) లెక్కల్ని సవరించింది. చాలా తక్కువ మొత్తంలో నిర్మాతలకు అందిస్తోంది. కమీషన్లు పోను, నిర్మాతలకు ఏం మిగలట్లేదిప్పుడు.
ఉన్నంతలో జీ5, సోనీ లివ్ మాత్రమే రీజనల్ కంటెంట్ కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఇవి కూడా తమ మోడల్స్ మార్చుకున్నాయి. డైరక్ట్ స్ట్రీమింగ్ కింద మాత్రమే సినిమాలు తీసుకునే సోనీ లివ్ ఇప్పుడు తన స్ట్రాటజీ మార్చగా.. జీ5 ఎక్కువగా వెబ్ సిరీస్ పై దృష్టి పెట్టింది. ఇక ఆహా ఓటీటీ అయితే, ఏ కంటెంట్ ఎంత చీప్ గా వస్తుందా అని ఎదురుచూస్తోంది. మొదట్నుంచి ఈ సంస్థది ఇదే పద్ధతి.
ఇలా ఓటీటీలన్నీ వేటికవే భిన్నమైన ప్లాన్స్ తో ముందుకెళ్తున్న నేపథ్యంలో.. టాలీవుడ్ నిర్మాతలకు రాబోయే రోజుల్లో ఓటీటీ డీల్స్ నుంచి పెద్దగా గిట్టుబాటు అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.
Correct decision by ott
Every industry produces great movies..some may have not performed well at the box office..if OTTs focus on such underdogs that has great content, that will be more than enough…no one cares for stars these days..
Tollywood movies should be banned permanently famous for fake collection