మంచి సినిమా.. వారానికే క్లోజ్ అయింది

ఈమధ్య కాలంలో క్లీన్ హిట్ అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా అంటే ముందుగా గుర్తొచ్చే సినిమా అశోకవనంలో అర్జునకల్యాణం. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.  Advertisement…

ఈమధ్య కాలంలో క్లీన్ హిట్ అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా అంటే ముందుగా గుర్తొచ్చే సినిమా అశోకవనంలో అర్జునకల్యాణం. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 

యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇందులో ఉంది. మొదటి రోజు మొదటి ఆటకే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా థియేటర్లలో నిలబడలేకపోయింది. దీనికి కారణం సర్కారువారి పాట.

కంటెంట్ ఎంత బాగున్నప్పటికీ, రిలీజ్ టైమ్ కూడా చాలా ముఖ్యం. ఈ విషయంలో అశోకవనం నిర్మాతలు తప్పు చేశారు. సరిగ్గా సర్కారువారి పాటకు వారం ముందు సినిమాను విడుదల చేశారు. దీంతో మూవీకి మంచి అప్లాజ్ వచ్చినప్పటికీ, వసూళ్లు రాలేదు. నిన్నటికి నిన్న ఈ సినిమా చాలా థియేటర్లను కోల్పోవాల్సి వచ్చింది.

సర్కారువారి పాట సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లన్నింటినీ దోచిపెట్టారు. తప్పనిసరి పరిస్థితుల మధ్య ఆచార్యకు కొన్ని థియేటర్లు కేటాయించారు. కేజీఎఫ్2 ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి, అది తనకంటూ కొన్ని థియేటర్లను అట్టిపెట్టుకుంది. ఈ క్రమంలో బలిపశువు అయింది విశ్వక్ సేన్ సినిమా మాత్రమే.

పెద్ద సినిమాల్లా విశ్వక్ సేన్ సినిమాకు టికెట్ రేట్లు పెంచలేదు. సాధారణ ధరలతోనే సినిమా రిలీజైంది. దీంతో సినిమా హిట్టయినా, వసూళ్లు పెద్దగా రాలేదు. మరో వారం ఆడితే లాభాలు చూసేది కానీ మహేష్ సినిమా ఆ అవకాశం ఇవ్వలేదు. సర్కారువారి పాట బాక్సాఫీస్ ను కమ్మేయడంతో, అశోకవనం మసకబారింది.

ఈ సినిమా తనకంటూ కొన్ని థియేటర్లు నిలుపుకున్నప్పటికీ, వసూళ్లు ఏ స్థాయిలో వస్తాయనేది చెప్పడం కష్టం. ప్రస్తుతం ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చి ఆగింది.