Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆ ఒక్కటి చెప్పేసిన అల్లరి నరేష్

ఆ ఒక్కటి చెప్పేసిన అల్లరి నరేష్

లాంగ్ గ్యాప్ తర్వాత ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేశాడు అల్లరి నరేష్. దీనికితోడు సినిమా టీజర్ క్లిక్ అయింది. దీంతో ఆ ఒక్కటి అడక్కు సినిమాపై కూసింత అంచనాలు పెరిగాయి. ఇదే వేడిలో సినిమా రిలీజ్ చేయాలని యూనిట్ గట్టిగా ఫిక్స్ అయినట్టుంది.

మే 3న 'ఆ ఒక్కటి అడక్కు' సినిమాను రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించేశారు. సినిమా రిలీజ్ కు సరిగ్గా 2 వారాలే టైమ్ ఉందన్నమాట. ఈ 2 వారాల్లోనే అన్ని పనులు పూర్తిచేసుకుంటూ, ప్రచారం కూడా చేయాల్సి ఉంటుంది.

అన్నింటికీ సిద్ధపడే యూనిట్ ఈ డేట్ ప్రకటించింది. దీనికి కారణం థియేటర్లలో పోటీ లేకపోవడమే. భారీ అంచనాల మధ్య వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఆడలేదు. భారీ అంచనాలతో రావాల్సిన కల్కి చెప్పిన తేదీకి రావడం లేదు. టిల్లూ స్క్వేర్ హంగామా ఆల్రెడీ తగ్గింది. ఈ గ్యాప్ లో పెద్ద సినిమాలు రావడం లేదు. అందుకే ఆఘమేఘాల మీద రిలీజ్ డేట్ చెప్పేశారు.

ఏషియన్ సురేష్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మల్లి అంకం దర్శకుడు. గోపీసుందర్ సంగీతం అందించాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?