Advertisement

Advertisement


Home > Movies - Movie News

మరో సీరియస్ సబ్జెక్ట్ ఎత్తుకున్న అల్లరి నరేష్

మరో సీరియస్ సబ్జెక్ట్ ఎత్తుకున్న అల్లరి నరేష్

వరుసపెట్టి కామెడీ సినిమాలు చేసిన అల్లరినరేష్ అనుకున్న హిట్ అందుకోలేకపోయాడు. నాంది సినిమా అతడికి మంచి విజయాన్నందించింది. అదొక సీరియస్ సబ్జెక్ట్. దీంతో అదే ఫార్మాట్ లో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా చేస్తున్నాడు అల్లరోడు. ఇది కూడా సీరియస్ సబ్జెక్టే. అభివృద్ధికి దూరంగా ఉన్న ఓ గిరిజన ప్రాంతం, అక్కడ సమస్యల్ని సీరియస్ గా చర్చించినట్టు తెలుస్తోంది.

ఈరోజు రిలీజైన టీజర్ లో ఆ ఛాయలే ఎక్కువగా కనిపించాయి. ఓ గర్భవతిని మంచంపై మోసుకుంటూ నది దాటించడం లాంటి సన్నివేశాలతో పాటు, అల్లరినరేష్ వరుసపెట్టి దెబ్బలు తినే సీన్లు చూస్తుంటే, ఇదొక కాన్సెప్ట్ బేస్డ్ సీరియస్ మూవీ అనే విషయం అర్థమౌతూనే ఉంది. టీజర్ లో అల్లరి నరేష్ తో పాటు ఆనంది, వెన్నెల కిషోర్, రవిప్రకాష్, సంపత్ రాజ్, ప్రవీణ్ పాత్రల్ని పరిచయం చేశారు.

టీజర్ లో అల్లరినరేష్ తర్వాత చెప్పుకోదగ్గ ఎలిమెంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రాఫర్ రామ్ రెడ్డి అందించిన విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. హాస్య మూవీస్, జీ స్టుడియోస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఏఆర్ మోహన్ ఈ కథ రాసుకున్నాడు. స్వయంగా తనే డైరక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో అల్లరినరేష్ ను మరో డిఫరెంట్ కోణంలో చూపిస్తానంటున్నాడు ఈ దర్శకుడు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో అల్లరినరేష్ ఉపాధ్యాయుడిగా కనిపించబోతున్నాడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?