మహేష్, ప్రభాస్ కంటే బన్నీ టాప్

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్, 14 కోట్ల రూపాయల ఆదాయపు పన్ను చెల్లించాడు. టాలీవుడ్ నుంచి ఈ ఏడాది అత్యథికంగా పన్ను చెల్లించిన నటుడు బన్నీ మాత్రమే. 2024 సంవత్సరానికి గాను భారీగా ఇన్…

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్, 14 కోట్ల రూపాయల ఆదాయపు పన్ను చెల్లించాడు. టాలీవుడ్ నుంచి ఈ ఏడాది అత్యథికంగా పన్ను చెల్లించిన నటుడు బన్నీ మాత్రమే. 2024 సంవత్సరానికి గాను భారీగా ఇన్ కమ్ ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీల జాబితా విడుదలైంది.

టాప్-20లో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ పేరు మాత్రమే ఉంది. భారీగా పారితోషికం తీసుకుంటున్న చాలామంది హీరోల పేర్లు లిస్ట్ లో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

మహేష్ బాబు, ప్రభాస్ పేర్లు టాప్-20 జాబితాలో లేవు. అలా అని వీళ్లు బన్నీ కంటే తక్కువ ఆదాయం కలిగి ఉన్నారని కాదు, బన్నీ కంటే తక్కువ ట్యాక్స్ కట్టారని మాత్రమే అర్థం.

ఇక ఈ టాప్-20 సెలబ్రిటీల లిస్ట్ లో సౌత్ నుంచి దళపతి విజయ్ (రూ. 80 కోట్లు), మోహన్ లాల్ (రూ. 14 కోట్లు) ఉన్నారు. ఈ ఏడాది హయ్యస్ట్ ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీగా షారూక్ ఖాన్ (రూ. 92 కోట్లు) నిలవగా.. రెండో స్థానంలో విజయ్ నిలిచాడు.

మూడో స్థానంలో సల్మాన్ ఖాన్ (రూ. 75 కోట్లు), నాలుగో స్థానంలో అమితాబ్ (రూ. 71 కోట్లు), ఐదో స్థానంలో విరాట్ కోహ్లి (రూ. 66 కోట్లు) నిలిచారు. టాప్-10లో రణబీర్, ధోనీ, టెండూల్కర్ ఉన్నారు.

19 Replies to “మహేష్, ప్రభాస్ కంటే బన్నీ టాప్”

  1. GST కట్టిన తర్వాత (రెమ్యూనరేషన్ మీద) ఇంకా ఇన్కమ్ టాక్స్ ఎందుకు కట్టాల్సి వస్తుంది? మార్చ్ నెల లోపు మహేష్, ప్రభాస్ సినిమాలు చేశారు, అల్లు అర్జున్ సినిమాలు ఏమీ చెయ్యకుండా ఇన్కమ్ టాక్స్ ఏమిటి? వేరే వ్యాపారాల మీదనా?

  2. తాను రాజకీయ నాయకుడైన కారణంగా ఏంచేసైనా ఎవరిని ముంచి అయిన, అక్రమార్జన చేయవచ్చు. అది తన జన్మహక్కు అని , ఎన్ని ప్యాలెస్లు అయిన కట్టుకోవడం తన హక్కు . తాను పారేసే ముష్టి మీద జనాలు బతకాలని, తనని పదే పదే పొగడాలని అంటున్న ప్యాలెస్ పక్షి.

Comments are closed.