గత సంక్రాంతికి బన్నీ చేతిలో సినిమా లేదు. సో.. ఆయన ఫుల్ ఫ్రీ. దీంతో ఆయన తన బంధువుల ఇళ్లు ఓ రౌండ్ వేశాడు. కానీ ఈ ఏడాది సంక్రాంతిని మాత్రం ధూంధామ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్. దీనికి కారణం అల వైకుంఠపురములో సినిమా. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో బన్నీకి సిసలైన పండగ వచ్చేసింది.
ఉదయాన్నే తన భార్యపిల్లలతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లాడు అల్లు అర్జున్. మెగా హీరోలందరితో కలిసి సంక్రాంతిని పండగను సెలబ్రేట్ చేసుకున్నాడు. మెగా హీరోలంతా సింగిల్ ఫ్రేమ్ లో దిగిన ఫొటో నిన్నంతా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలో పవన్ కల్యాణ్ కొడుకు అకిరా కూడా ఉన్నాడు. మధ్యాహ్నం చిరంజీవి ఇంట్లోనే భోజనం చేసిన బన్నీ, సాయంత్రానికి తన ఇంటికి షిఫ్ట్ అయ్యాడు.
సాయంత్రం కొంతమంది మెగా కాంపౌండ్ హీరోలతో పాటు మరికొందరు ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేశాడు బన్నీ. ఈ సందర్భంగా మ్యూజికల్ నైట్ కూడా ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో అల వైకుంఠపురములో సాంగ్ పాడుతుంటే, బన్నీ కూడా గొంతు కలిపాడు. భార్య స్నేహారెడ్డితో కలిసి మ్యూజికల్ నైట్ ను ఎంజాయ్ చేశాడు. ఈ వీడియోను రాత్రి అల్లు శిరీష్ షేర్ చేశాడు.
ఇక సినిమా విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో అల వైకుంఠపురములో సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. తాజాగా సరిలేరు నీకెవ్వరు కలెక్షన్లను క్రాస్ చేసిన ఈ సినిమా 1.8 మిలియన్ డాలర్ వసూళ్లు సాధించింది. ఈరోజు లేదా రేపట్లోగా ఇది 2 మిలియన్ డాలర్ మార్క్ టచ్ చేయబోతోంది. ఫైనల్ రన్ తో ఇది 3 మిలియన్ డాలర్ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.