వినడానికి చాలా క్రేజీగా ఉంది కదా. నిజంగా వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే అంతే క్రేజీగా ఉంటుంది. వాస్తవంగా చూస్తే ఇది కార్యరూపం దాల్చే అవకాశం లేదు. అయితే ఇలాంటి ఫాంటసీ కాంబినేషన్ పై కూడా రియాక్ట్ అయ్యాడు అల్లు అర్జున్. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఓపిగ్గా సమాధానం చెప్పాడు.
మెగా కాంపౌండ్ లో మీరు, పవన్ కల్యాణ్ కలిసి సినిమా చేస్తారా? చేస్తే ఎప్పుడు చేస్తారు?
ఇది ప్రశ్న. దీనికి బన్నీ కూడా అంతే స్ట్రయిట్ గా సమాధానం ఇచ్చాడు. పవన్ తో సినిమా చేయడానికి తను ఎప్పుడూ రెడీ అని ప్రకటించాడు అల్లు అర్జున్. కాకపోతే మంచి స్క్రిప్ట్ దొరకాలన్నాడు. తామిద్దర్ని బ్యాలెన్స్ చేసేలా మంచి స్క్రిప్ట్ దొరికితే పవన్ తో కలిసి నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించాడు.
అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఇవి కేవలం ఫాంటసీ కాంబినేషన్లు మాత్రమే. “చెప్పను బ్రదర్” అన్న బన్నీతో పవన్ సినిమా చేస్తాడని ఎవరూ కలలో కూడా ఊహించరు. అటు బన్నీకి కూడా పవన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనే క్రేజీ ఆలోచన కూడా లేదు. ఉంటే, అంతో ఇంతో అలాంటి ఆలోచన రామ్ చరణ్ ఉందేమో కానీ, బన్నీ మాత్రం పవన్ తో సినిమా చేసే ఛాన్స్ లేదు. అభిమాని అడిగాడు కాబట్టి, నెపాన్ని స్క్రిప్ట్ పై నెట్టేశాడంతే.
అభిమానులు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు బన్నీ. నేషనల్ మీడియాకు ఈమధ్య కాస్త ఎక్కువగా దగ్గరవుతున్న ఈ హీరో.. తనకు యాక్షన్-కామెడీ మిక్స్ అయ్యే సినిమాలు చేయడమంటే ఇష్టమని ప్రకటించాడు. ఇక డాన్స్ విషయానికొస్తే.. అది కేవలం భోజనంలో డెసర్ట్ లా ఉండాలి తప్ప, డాన్సే భోజనంలా ఉండకూడదని చమత్కరించాడు.