చంద్రబాబునాయుడు పాపం బీజేపీ ప్రాపకం కోసం ఎదురుచూస్తున్నారు. దాసుని తప్పులు దండంతో సరి అని క్షమించేయమని బాబు గారు వేడుకుంటున్నారు. బీజేపీతో కలసిపోదామని ఆయన తెగ తాపత్రయపడుతున్నారు. ఆ పార్టీని దూరం చేసుకుని తప్పు చేశానని బాబు ఏకంగా బాహాటంగానే భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు.
అయినా బీజేపీ నేతలు కరగడం లేదు. పైగా బాబుని దారుణంగా తిడుతున్నారు. ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవధర్ అయితే ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీని పట్టుకుని గజదొంగ , మోసగాడు, వెన్నుపోటు నేత అంటూ ఘోరంగా నిందించేశారు.
అమరావతిలో బాబు సర్కార్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కూడా సునీల్ దేవధర్ తేల్చేశారు. పెద్ద ఎత్తున కుంభకోణాలు చోటుచేసుకున్నాయని కూడా ఆయన బండలు వేశారు.
ఓ వైపు బీజేపీ అమరావతిని ఆపుతుందని బాబుతో పాటు తమ్ముళ్లంతా కోటి ఆశలు పెట్టుకుంటే బీజేపీ నేతలు మాత్రం ఇలా పెద్ద నోరు చేసుకుంటున్నారు. బాబుని పట్టుకుని దులిపేస్తున్నారు. మరి బీజేపీ మీద ఇంకా బాబు ఆశలు పెట్టుకుంటారా. లేక తన దారి తాను చూసుకుంటారా. చూడాలి మరి.