బన్నీ Vs చరణ్.. బయట యుద్ధం, ఇంట్లో అనురాగం

అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందంటూ ఈమధ్య చాలా స్టోరీలొచ్చాయి. వాటికి బలం చేకూర్చేలా ఈమధ్య వ్యవహరించాడు బన్నీ. చరణ్ పుట్టినరోజును పట్టించుకోలేదు. ఆస్కార్ అవార్డ్ వచ్చినప్పుడు కూడా చరణ్…

అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందంటూ ఈమధ్య చాలా స్టోరీలొచ్చాయి. వాటికి బలం చేకూర్చేలా ఈమధ్య వ్యవహరించాడు బన్నీ. చరణ్ పుట్టినరోజును పట్టించుకోలేదు. ఆస్కార్ అవార్డ్ వచ్చినప్పుడు కూడా చరణ్ పై సరిగ్గా స్పందించలేదు. పైగా చరణ్ ను గ్లోబల్ స్టార్ అని సంబోధించడానికి ఇష్టపడలేదు.

ఈ నేపథ్యంలో బన్నీ-చెర్రీ మధ్య ఏదో నడుస్తోందంటూ చాలా కథనాలు వచ్చాయి. అయితే ఇవన్నీ సినిమాల వరకే. ఇంట్లో ఇద్దరూ కలిసిపోయారు. తాజాగా జరిగిన ఉపాసన సీమంతం వేడుకకు అల్లు అర్జున్ హాజరయ్యాడు. తన కుటుంబంతో పాటు వచ్చి ఉపాసనను ఆశీర్వదించాడు.

అక్కడితో ఆగలేదు. ఉపాసనతో దిగిన ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు బన్నీ. “నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉంది ఉప్సి” అంటూ స్పందించాడు. తాజా ఫొటోతో బన్నీ-చరణ్ మధ్య 'ఆల్ ఈజ్ వెల్' అనే సందేశం ఇచ్చినట్టయింది.

బన్నీకి ఇలాంటివి కొత్త కాదు..

గతంలో పవన్ కు బన్నీకి పడదన్నారు. 'చెప్పను బ్రదర్' అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ తో చాలా రచ్చ చేశారు పవన్ ఫ్యాన్స్. ఆ తర్వాత ఓ సందర్భంలో పవన్ ను కౌగిలించుకొని, టోటల్ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాడు బన్నీ. చిరంజీవి, అల్లు అర్జున్ మధ్య కూడా పడట్లేదంటూ కొన్ని స్టోరీలు వచ్చాయి. 

మెగా కాంపౌండ్ ను దాటి, చిరంజీవి అనే మహావృక్షం నుంచి బయటకొచ్చి, సొంత ఇమేజ్ కోసం బన్నీ ప్రయత్నిస్తున్నాడని, అందుకే మెగా ఫ్యాన్స్ అనే ట్యాగ్ తీసేసి, తనకంటూ సొంతంగా అల్లు అర్జున్ ఆర్మీ అనే అభిమాన సంఘాన్ని పెట్టుకున్నాడని అన్నారంతా.

ఆ తర్వాత ఓ సందర్భంలో చిరంజీవిపై ట్వీట్ చేస్తూ, మరో సందర్భంలో చిరంజీవిని కౌగలించుకొని తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇప్పుడు తాజాగా వచ్చిన ఊహాగానాలకు కూడా ఇలా తనదైన శైలిలో చెక్ పెట్టాడు బన్నీ. ఉపాసనతో దిగిన ఫొటోను షేర్ చేసి, తనకు చరణ్ కు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.