అల్లు స్టూడియోకి ముందు ..

అల్లు అరవింద్..ఆయన ముగ్గురు కుమారుల అల్లు స్టూడియో ప్లానింగ్ లో వున్న సంగతి తెలిసిందే. సుమారు 11 ఎకరాల్లో ఈ స్టూడియో తయారుకాబోతోంది. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబి ఈ స్టూడియో…

అల్లు అరవింద్..ఆయన ముగ్గురు కుమారుల అల్లు స్టూడియో ప్లానింగ్ లో వున్న సంగతి తెలిసిందే. సుమారు 11 ఎకరాల్లో ఈ స్టూడియో తయారుకాబోతోంది. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబి ఈ స్టూడియో గురించి ఓ ముచ్చట చెప్పారు. 

అసలు ఈ స్థలం కొన్నపుడు స్టూడియో ఆలోచనే లేదట. నగరానికి కాస్త దూరంగా స్థలం వుంది కనుక ముగ్గురు సోదరులకు కలిపి ఓ మాంచి వీకెండ్ రిసార్ట్ లా కట్టుకుందాం ఎప్పటికైనా అని అనుకున్నారట.

ఆ తరువాత తరువాత అక్కడ ఓల్డ్ పీపుల్ కు పనికి వచ్చేలా ఓ మాంచి ఆయుర్వేదిక్ రిసార్ట్ కమ్ వెల్ నెస్ సెంటర్ అయితే బాగుంటుంది కదా అనుకున్నారట. అయితే ఆ స్థలం చుట్టూ అన్నీ హై రైజ్ బిల్డింగ్ లు రావడంతో, ప్రైవ‌సీ వుండదని భావించారట. అప్పుడు స్టూడియో ఆలోచన వచ్చిందట. 

సినిమా టెక్నీషియన్స్ అంతా నివసించే ప్రాంతాలకు దగ్గరగా స్టూడియో కడితే పది, పదిహేను నిమషాల్లో అక్కడకు చేరిపోవచ్చు అన్న ఆలోచన వచ్చి, స్టూడియోకి శ్రీకారం చుట్టామని అల్లు బాబి చెప్పారు.

ఎప్పుడు మీడియా ముందుకు పెద్దగా రాని, ఇంటర్వ్యూ ఇవ్వని అల్లు బాబి ‘గ్రేట్ ఆంధ్ర’ కు ఇంటర్వూ ఇచ్చారు. అనేక విషయాలను ఆయన షేర్ చేసుకున్నారు. ఆహా స్టార్ట్ చేసే ముందు అప్పటికే మార్కెట్ లో వున్న పెద్ద ప్లేయర్లను చూసి కాస్త భయపడ్డామన్నారు. 

ప్రింట్ లు అరిగిపోవడం చూసి క్యూబ్ డిజిటల్ ఫార్మాట్ ను, బ్లాక్ టికెట్ల దందా తగ్గించాలని ‘టికెట్ దాదా’ (జ‌స్ట్ టికెట్స్) ను స్టార్ట్ చేసానన్నారు. తనకు ఏదైనా చేస్తే ఓ కిక్ వుండాలని, పది మందికి అది ఉపయోగపడేలా వుండాలని కోరిక అన్నారు.

ప్రైవసీసీకి తాను ప్రయారిటీ ఇస్తానని అందుకే సినిమాల్లో నటించడం వైపు మొగ్గు చూపలేదని, చాలా మంది అడిగారని, అరవింద్ గారే రెడీగా వున్నారని బాబి చెప్పారు.