‘అల్లుడు’ తో మోనాల్

అల్లరి నరేష్ తో సుడిగాడు సినిమా చేసి, చిట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని తొడగొట్టిన హీరోయిన్ మోనాల్ ను జనం ఏనాడో మరిచిపోయారు.  Advertisement కానీ బిగ్ బాస్ సీజన్ 4 తో మోనాల్…

అల్లరి నరేష్ తో సుడిగాడు సినిమా చేసి, చిట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని తొడగొట్టిన హీరోయిన్ మోనాల్ ను జనం ఏనాడో మరిచిపోయారు. 

కానీ బిగ్ బాస్ సీజన్ 4 తో మోనాల్ మళ్లీ జనాల్లోకి వచ్చింది. మాంచి క్రేజ్ కూడా వచ్చింది. దాంతో మళ్లీ సినిమా చాన్స్ లు వెదుక్కుంటూ వస్తున్నాయి. 

అన్నింటికన్నా ముందుగా అల్లుడు అదుర్స్ లో చాన్స్ వచ్చింది. ఓ మాంచి అయిటమ్ సాంగ్ ను మోనాల్ చేయబోతోంది. 

హీరో బెల్లంకొండ సాయి సినిమాల్లో ఐటమ్ సాంగ్ ల ప్రత్యేకంగా వుంటాయి. టాప్ హీరోయిన్లును ఏరి కోరి తెస్తుంటారు. అలాంటిది ఈసారి ఈ అవకాశం మోనాల్ ను వరించింది.

ఈ మేరకు వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఐటమ్ సాంగ్ చిత్రీకరణ ప్రారంభమైంది. మాంచి గ్లామరస్ గెటప్ ప్లస్ డ్రెస్ లో మోనాల్ సెట్ లోకి అడుగుపెట్టింది.

ఇళ్ల పట్టాలు నిరంతర ప్రక్రియ