అమరావతికి అటు ఇటు అన్నదే టైటిల్ అయి వుంటే ఉగాదికి గ్లింప్స్ వచ్చేసి వుండేది. గ్లింప్స్ తయారీకి ముందు ఈ టైటిల్ తో నిర్మాత, హీరో ఇద్దరూ హ్యాపీనే. గుంటూరు హీరో..హైదరాబాద్ హీరోయిన్ ల నేపథ్యంలో జరిగే కథ. అందుకే అమరావతికి అటు ఇటు అనే టైటిల్ ఎలా వుంటుంది అని అనుకున్నారు.
అంతకు ముందు గుంటూరు కారం అనే టైటిల్ కూడా డిస్కస్ చేసారు. కానీ మహేష్ లెవెల్ కు సరిపోదు అని వీటో చేసేసారు. అమరావతి కి అటు ఇటు టైటిల్ అనౌన్స్ చేసేద్దాం అనుకుని, దానికి తగిన వీడియో గ్లింప్స్ తయారు చేయించారు.
అదిగో అక్కడ వచ్చింది సమస్య. గ్లింప్స్ చూస్తే అదిరిపోయింది. టైటిల్ చూస్తే దాని ముందు వీక్ అనిపించింది. పైగా అమరావతి అన్నది ఆంధ్రలో పొలిటికల్ కలర్ తో కూడుకున్నది. మహేష్ పక్కాగా న్యూట్రల్ గా వుండే హీరో. ఎందుకు వచ్చిన తలనొప్పి అని పక్కన పెట్టారు.
ఇప్పుడు వీడియోకి, సినిమాకు, మహేష్ కు తగిన ‘అ’ టైటిల్ కావాలి. దాని కోసం వెదుకులాట. శ్రీరామనవమి నాటికి గ్లింప్స్-టైటిల్ ఇచ్చేయాలన్నది ప్లాన్. ఇప్పటికే గ్లింప్స్ కంటెంట్ ఏమిటన్న సమాచారం ఫ్యాన్స్ గ్రూపుల్లోకి వెళ్లిపోయింది.
ఇక ఆలస్యం చేయకుండా గ్లింప్స్ ఇచ్చేయాల్సి వుంది. టైటిల్ ఫిక్స్ అయినా కాకపోయినా.