మైత్రీ సంస్థకు అమెజాన్ కు ఓటిటి అనుబంధం వుంది. ఆ బంధం ఇప్పుడు కట్ అయిందని అమెజాన్ సంస్థ మైత్రీ కి దూరం అయిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
పుష్ప 2 సినిమా విషయంలో మైత్రీ వ్యవహరించిన తీరే ఇందుకు కారణమని తెలుస్తోంది. పుష్ప సినిమా మొదటి భాగం అమెజాన్ ఓటిటిలోనే విడుదలయింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అమెజాన్ సంస్థ మైత్రీ మీద కాస్త అలకతో వుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం పుష్ప 2 హక్కుల వ్యవహారమే.
పుష్ప 2 ఓటిటి హక్కులు కూడా అమెజాన్ కే అనుకున్నారు అంతా. చాలా రోజుల పాటు, మైత్రీకి, అమెజాన్ ప్రతినిధులకు మధ్య సమావేశాలు, చర్చలు సాగాయి. కానీ వున్నట్లుండి నెట్ ఫ్లిక్స్ కు పుష్ప 2 హక్కులు ఇచ్చేసారు. ఇది అమెజాన్ ప్రతినిధులను షాక్ కు గురి చేసిందని బోగట్టా. తమతో మాట మాత్రం చెప్పకుండా, తమతో డిస్కస్ చేస్తూనే నెట్ ఫ్లిక్స్ కు ఇచ్చేసారి అమెజాన్ ప్రతినిధుల ఫీలయ్యారని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
నిజానికి ఏ అమ్మకాలు అయినా ఎక్కడ ఓ రూపాయి ఎక్కువ వస్తుందో అక్కడ ఇవ్వడం అన్నది కామన్ పాయింట్. అందులో అణుమాత్రం తప్పు లేదు. ఎందుకంటే ఎవరైనా తమ ప్రొడెక్ట్ కు ఓ రూపాయి ఎక్కువ రావాలనే కోరుకుంటారు. అయితే తమతో డిస్కషన్లు సాగిస్తూ అటు ఇచ్చేసారని కాస్త అలక వుంటుంది కదా? అదే ఇప్పుడు అమెజాన్ కు మైత్రీ కి మధ్యలో దూరాన్ని పెంచిందని వినిపిస్తోంది టాలీవుడ్ లో.