Advertisement

Advertisement


Home > Movies - Movie News

నేను సినిమాల్లోకి వెళ్తే పవన్ పీడ పోయేది

నేను సినిమాల్లోకి వెళ్తే పవన్ పీడ పోయేది

పవన్ కల్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ నేత అంబటి రాంబాబు. తన ప్రాంతానికి వచ్చి తనపై పవన్ చేసిన ఆరోపణల్ని తిప్పికొట్టారు.

ఇంతకీ పవన్ ఏమన్నారంటే.. అంబటి రాంబాబు రాజకీయాలు చేసే బదులు, ఆయనకున్న కళాపోషణతో సినిమాల్లోకి వెళ్లినట్టయితే, రాజకీయాల్లో ఓ పీడ పోయేది అన్నారు. ఈ వ్యాఖ్యలపై అంబటి ఘాటుగా స్పందించారు. తను సినిమాల్లోకి వెళ్తే, పవన్ పీడ పోయేదన్నారు.

"నేను సినిమాల్లోకి వెళ్తే పవన్ కల్యాణ్ పీడ పోయేది. నాకు సినిమాలంటే ఆసక్తి లేదు కాబట్టి అటు వెళ్లలేదు. నాకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి, మహానటుడ్ని అయితే, జనాలకు పవన్ పీడ పోయేది. ఎవరికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో ఉంటారు. నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్."

తనకు రాజకీయాలంటే ఆసక్తి అనే విషయం అందరికీ తెలుసని, విద్యార్థి దశ నుంచి తను రాజకీయాల్లో ఉన్నానని, భవిష్యత్తులో కూడా రాజకీయాల్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు అంబటి. అదే టైమ్ లో పవన్ కు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో అతడికే తెలియదని.. సినిమాలు-రాజకీయాలంటూ 2 పడవల ప్రయాణం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?