మళ్లీ కరోనా బారిన ప‌డ్డ‌ బిగ్‌బీ!

గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా వ్యాక్సిన్స్‌, లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా ప్రస్తుతం కేసులు భారీగా తగ్గుముఖం పట్టిన‌ట్లే ప‌ట్టి మ‌ళ్లీ త‌న ప్ర‌భావం చూపిస్తోంది. తాజ‌గా బాలీవుడ్ న‌టుడు…

గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా వ్యాక్సిన్స్‌, లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా ప్రస్తుతం కేసులు భారీగా తగ్గుముఖం పట్టిన‌ట్లే ప‌ట్టి మ‌ళ్లీ త‌న ప్ర‌భావం చూపిస్తోంది. తాజ‌గా బాలీవుడ్ న‌టుడు బిగ్ బీ అమితాబ్ బచ్చ‌న్ మరోసారి క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో ఆయ‌న ఆసుప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. 

త‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని, గ‌త కొన్ని రోజులుగా త‌న‌తో క‌లిసినా వారు, ఉన్న‌వారంతా క‌రోనా ప‌రీక్షలు చేయించుకొండి అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు.

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్  కు కరోనా సోకడం ఇది రెండోసారి. తొలిదశ కరోనా విజృంభించిన నేపథ్యంలోనే ఆయన మహమ్మారి బారిన పడ్డారు. అప్ప‌ట్లో హాస్పిట‌ల్ లో ఉండి చికిత్స తీసుకున్నారు.

అమితాబ్‌ బచ్చన్‌కి కరోనా సోకిన విషయం తెలియగానే ఆయన అభిమానులు, సిని ప్రేమికులు ఆందోళనకు గురయ్యారు. అమితాబ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.