బీహార్ లో ఒకవైపు అన్ని రాజకీయ పార్టీలు ఫ్లోర్ టెస్ట్ కు రెడీ అవుతుంటే.. మరో వైపు ఆర్జేడీ నాయకులపై సీబీఐ దాడులు జరుగుతున్నాయి.
బీహార్ శాసనసభలో బలపరీక్షకు ముందు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం పాట్నాలోని ఆర్జెడి ఎమ్మెల్సీ సునీల్ సింగ్ నివాసంపై దాడి చేసింది. రైల్వే ఉద్యోగాలు, భూ కుంభకోణానికి సంబంధించి సీబీఐ దాడులు జరిగాయి. ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ తో పాటు మరో ఆర్జేడీ నేత నివాసలపై సీబీఐ బుధవారం దాడులు చేసింది.
ఈ నెల ప్రారంభంలో బీజేపీతో తెగదెంపులు చేసుకుని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ), కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన మెజారిటీని నిరూపించుకునే కీలకమైన బలపరీక్షకు కొన్ని గంటల ముందు సీబీఐ దాడులు బీహార్ రాష్ట్రాని కుదిపెస్తోంది.
ఈ ఏడాది మేలో మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీ దేవి, ఇద్దరు కుమార్తెలు, మరో 12 మందిపై సీబీఐ కేసులు నమోదు చేసారు. ఈ కుంభకోణంలో భూములకు బదులుగా ఉద్యోగాలు ఇప్పించారని ఆరోపణలు వచ్చాయి.
ఉద్దేశ్యపూర్వకంగానే సీబీఐ, ఈడీ దాడులతో పార్టీ నేతలను హింసిస్తున్నారని ఆర్జేడీ నేతలు అరోపిస్తున్నారు.