'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' పేరుతో రూపొందిన సినిమాపై పిటిషనర్ చెప్పిన అభ్యంతరాలకు అనుగుణంగా మార్పు చేర్పులు చేసినట్టుగా హై కోర్టుకు నివేదించారు రామ్ గోపాల్ వర్మ తరఫు న్యాయవాదులు. సినిమా టైటిల్ తో సహా మొత్తం పన్నెండు రకాల అభ్యంతరాలను పిటిషనర్ పేర్కొన్నట్టుగా.. ఆ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని.. ఆ మేరకు మార్పులు చేసినట్టుగా న్యాయవాది కోర్టుకు నివేదించారు.
ఈ నెల పన్నెండున ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్టుగా, ఆ మేరకు అనుమతులు ఇవ్వాలని కోర్టును కోరారు. ఇక ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ను కోరిందట న్యాయస్థానం. అయితే ఇప్పటి వరకూ దాన్ని సమర్పించలేకపోయినట్టుగా తెలుస్తోంది.
దీంతో ఈ నెల పన్నెండున అంటే రేపు ఈ సినిమా విడుదల చేయాలన్న ప్రయత్నం సఫలం అవుతుందా లేదా అనేది ఆసక్తిదాయకంగా మారింది. ఈ సినిమా టీజర్లతో ఎవరిని లక్ష్యంగా చేసుకున్నట్టో రామ్ గోపాల్ వర్మ గ్యాంగ్ స్పష్టం చేసినట్టుగా అయ్యింది.
అయితే ఆ టీజర్లను చూసినప్పుడే ఈ సినిమా విడుదల అవుతుందా? అనే సందేహాలు నెలకొన్నాయి. చివరకు కోర్టుకు వెళ్లింది వ్యవహారం. దీంతో విడుదల ఆగింది. అనేక మార్పులు చేసినట్టుగా కోర్టుకు నివేదిస్తోంది ఆర్జీవీ బృందం. మరి ఇప్పుడైనా వీరికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందో లేదో!