హీరోయిన్ అమ్ము అభిరామి 23 ఏళ్లకే ప్రేమలో పడిందా? అవుననే అంటున్నారు తమిళ జనం. దీనికి మరింత బలం చేకూరుస్తూ అభిరామి కూడా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.
అమ్ము అభిరామి, దర్శకుడు పార్థివ్ మణి ప్రేమించుకుంటున్నారే టాక్ కోలీవుడ్ లో చాన్నాళ్లుగా నడుస్తోంది. తాజాగా అతడు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నాడు. బర్త్ డే సందర్భంగా అమ్ము ఓ పోస్ట్ పెట్టింది. పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూనే, తన జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్స్ అని ఆమె రాసుకొచ్చింది. ఓ లవ్ సింబల్ కూడా తగిలించింది. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారనే మేటర్ దాదాపు నిర్థారణమైంది.
అమ్ము అభిరామి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఆమె తెలుగులో పలు సినిమాల్లో నటించింది. ఎఫ్‌సీయూకే అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. రీసెంట్ గా డెవిల్ సినిమాలో కూడా నటించింది.
తమిళ్ లో రెండేళ్ల కిందట మొదలైన ఓ టీవీ షో ద్వారా అమ్ము అభిరామి, పార్థివ్ మణి ఒకరికొకరు పరిచయం. అప్పట్నుంచి ఇద్దరూ క్లోజ్ గా ఉంటున్నారట. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారినట్టు కనిపిస్తోంది.