హీరోహీరోయిన్లు క్లోజ్ గా ఉండడం కామన్. అయితే కొంతమంది రిలేషన్ షిప్స్ సినిమాలకు అతీతంగా కొనసాగుతుంటాయి. ఉదాహరణకు విజయ్ దేవరకొండ, రష్మికనే తీసుకుందాం. వీళ్లిద్దరూ చాలా క్లోజ్. సినిమాలతో సంబంధం లేకుండా మినిమం గ్యాప్స్ లో కలుస్తుంటారు. కలిసి డిన్నర్లు చేస్తుంటారు. కొన్నిసార్లు విజయ్ కోసం వాళ్ల ఇంటికి కూడా వస్తూంటుంది రష్మిక.
ఇప్పుడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండకు కూడా అలాంటి హీరోయిన్ దొరికేసింది. ఆమె పేరు వర్ష బొల్లమ్మ. అవును.. వర్ష అంటే తనకు చాలా ఇష్టం అంటున్నాడు ఆనంద్ దేవరకొండ. ఆమె తనకు చాలా స్పెషల్ ఫ్రెండ్ అని చెబుతున్నాడు.
“వర్ష బొల్లమ్మ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఇందులో దాచడానికేం లేదు. మేం ఇద్దరం డాగ్ లవర్స్. కుక్కల గురించి మాట్లాడుతూ బాగా కనెక్ట్ అయిపోయాం. అలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. మేమిద్దరం కలిసి సినిమా చేసి మూడేళ్లవుతోంది. అయినా ఇంకా టచ్ లోనే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే, వర్ష బొల్లమ్మ నాకు చాలా స్పెషల్ ఫ్రెండ్.”
ఇలా వర్షతో తనకున్న రిలేషన్ షిప్ స్టేటస్ ను షేర్ చేశాడు ఆనంద్ దేవరకొండ. గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టిన ఈ హీరో.. లైప్ పార్టనర్ ను ఎన్నుకునే విషయంలో తనకు, విజయ్ దేవరకొండకు ఇంట్లో ఫుల్ ఫ్రీడమ్ ఉందనే విషయాన్ని చెప్పుకొచ్చాడు.
ఇదే ఇంటర్వ్యూలో లైగర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆనంద్ దేవరకొండ. విజయ్ లుక్స్ తో పాటు అతడి గొంతును, డైలాగ్ డెలివరీని ఇష్టపడే వాళ్లు చాలామంది ఉన్నారని.. అలాంటి హీరోను లైగర్ లో నత్తితో చూపించడం పెద్ద మైనస్ అయిందని తనదైన విశ్లేషణ ఇచ్చాడు.
లైగర్ రిలీజైన మొదటి రోజు మొదటి ఆటకే ఫ్లాప్ టాక్ వచ్చేసింది. ఆ టాక్ ను విజయ్ దేవరకొండ తీసుకున్నాడట. సినిమా ఫ్లాప్ అయిందని తెలిసిన వెంటనే జిమ్ కు వెళ్లిపోయాడట. జిమ్ లో 2 గంటల పాటు కసరత్తులు చేశాడట. శరీరాన్ని బాగా కష్టపెడితే మైండ్ ఫ్రీ అవుతుందని, అందుకే విజయ్ దేవరకొండ జిమ్ కు వెళ్లి లైగర్ నుంచి డిస్-కనెక్ట్ అయ్యాడని తెలిపాడు ఆనంద్ దేవరకొండ.