ఈసారి పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్

దొరసాని సినిమాతో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే.. ఆనంద్ యాక్టింగ్ స్కిల్స్ పై విమర్శలు చెలరేగాయి. కుర్రాడు ఇంకాస్త ట్రయినింగ్ తీసుకొని…

దొరసాని సినిమాతో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే.. ఆనంద్ యాక్టింగ్ స్కిల్స్ పై విమర్శలు చెలరేగాయి. కుర్రాడు ఇంకాస్త ట్రయినింగ్ తీసుకొని తెరపైకి రావాల్సిందంటూ కామెంట్స్ పడ్డాయి. అలాంటి విమర్శలతో సంబంధం లేకుండా తన రెండో సినిమాకు రెడీ అవుతున్నాడు ఆనంద్ దేవరకొండ.

వినోద్ అనే కొత్త దర్శకుడితో కలిసి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు ఆనంద్ దేవరకొండ. మొదటి సినిమాను కాస్త ప్రయోగాత్మకంగా ఎంపిక చేసుకున్న ఈ నటుడు.. తన రెండో సినిమాకు మాత్రం పూర్తిస్థాయి కమర్షియల్ సబ్జెక్ట్ ను సెలక్ట్ చేసుకున్నారు. లవ్, కామెడీ, రొమాన్స్ లాంటి ఎలిమెంట్స్ తో ఈ సినిమా రాబోతోంది.

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది. అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఈ నెలలోనే ఈ సినిమా ఓపెనింగ్ కూడా ఉంటుంది. నిజానికి వినోద్ అనే దర్శకుడు, విజయ్ దేవరకొండ కోసం కథ రాసుకున్నాడు.

ఆ కథను విజయ్ దేవరకొండకు వినిపించాడు కూడా. అయితే తనకంటే తన తమ్ముడు ఆనంద్ దేవరకొండకు ఈ స్టోరీ బాగా సూట్ అవుతుందంటూ విజయ్ అటువైపు మళ్లించాడట. ఇకపై విజయ్ కు కథలు చెప్పాలనుకునే దర్శకులు.. ఆనంద్ ను కూడా దృష్టిలో పెట్టుకుంటే మంచిదేమో.

టీడీపీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించగలదా?