టాలీవుడ్ లో బాలీవుడ్ నటవారసురాళ్లు

వంశపారంపర్యంగా ఇండస్ట్రీలో కొనసాగడం కొత్తకాదు. ఇటు టాలీవుడ్ నుంచి అటు బాలీవుడ్ వరకు ఈ కల్చర్ నడుస్తోంది. నెపోటిజం అంటూ ఎవరెన్ని విమర్శలు చేసినా ఇది ఆగదు. అందులో తప్పులేదు. అయితే ఈసారి టాలీవుడ్…

వంశపారంపర్యంగా ఇండస్ట్రీలో కొనసాగడం కొత్తకాదు. ఇటు టాలీవుడ్ నుంచి అటు బాలీవుడ్ వరకు ఈ కల్చర్ నడుస్తోంది. నెపోటిజం అంటూ ఎవరెన్ని విమర్శలు చేసినా ఇది ఆగదు. అందులో తప్పులేదు. అయితే ఈసారి టాలీవుడ్ లో ఓ ఎట్రాక్షన్ ఏంటంటే.. బాలీవుడ్ కు చెందిన ఇద్దరు ప్రముఖుల కూతుళ్లు ఇప్పుడు ఒకేసారి టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. ఎవరు క్లిక్ అవుతారో చూడాలి.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండేను తీసుకున్నారు. ఇప్పటికే హిందీలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, పతి పత్నీ ఔర్ వో లాంటి సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. దేవరకొండ సినిమాతో తెలుగులో డెబ్యూ ఇస్తోంది.

అనన్యకు పోటీగా మరో బాలీవుడ్ సెలబ్రిటీ కూతురు కూడా టాలీవుడ్ కు వస్తోంది. ఆమె పేరు సయీ మంజ్రేకర్. బాలీవుడ్ నటుడు, దర్శకుడు… పలు తెలుగు సినిమాల్లో విలన్ గా కూడా నటించిన మహేష్ మంజ్రేకర్ కూతురు ఈమె. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాతో ఈమె టాలీవుడ్  సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అవుతోంది.

ఇటు సయీ మంజ్రేకర్ కైనా, అటు అనన్య పాండేకైనా యాక్టింగ్ లో అనుభవం తక్కువే. అయితే గ్లామర్ ఒలకబోయడంతో ఇద్దరూ ఇద్దరే. ఫొటోషూట్లతో ఆ విషయాన్ని ఇద్దరూ ప్రూవ్ చేసుకున్నారు. బాలీవుడ్ లో అవకాశాలు పెద్దగా రాక ఇటువైపు మళ్లిన ఈ భామలిద్దర్లో ఎవరు తెలుగులో క్లిక్ అవుతారో చూడాలి.

నాలుగేళ్ల తర్వాత హిట్‌ వచ్చింది