సిగరెట్ తాగుతూ దొరికిపోయిన హీరోయిన్

హీరోయిన్లు సిగరెట్ తాగుతారా.. మందు కొడతారా.. ఇలాంటి ప్రశ్నలకు గంపగుత్తగా సమాధానాలు చెప్పలేం. ఎందుకంటే, ఈ విషయంలో అంతా బయటపడరు. ఇప్పుడిప్పుడే కొంతమంది హీరోయిన్లు ఓపెన్ గా తమ బ్రాండ్స్ చెబుతున్నారు. తమ దురలవాట్లను…

హీరోయిన్లు సిగరెట్ తాగుతారా.. మందు కొడతారా.. ఇలాంటి ప్రశ్నలకు గంపగుత్తగా సమాధానాలు చెప్పలేం. ఎందుకంటే, ఈ విషయంలో అంతా బయటపడరు. ఇప్పుడిప్పుడే కొంతమంది హీరోయిన్లు ఓపెన్ గా తమ బ్రాండ్స్ చెబుతున్నారు. తమ దురలవాట్లను బయటపెడుతున్నారు. పైకి అమాయకంగా కనిపిస్తూ, తెరవెనక రచ్చ చేసే హీరోయిన్ల గురించి తెలిసినప్పుడు మాత్రం ఆడియన్స్ షాక్ అవుతుంటారు. ఇది అలాంటిదే.

హీరోయిన్ అనన్య పాండే సిగరెట్ తాగుతూ దొరికిపోయింది. ఈ 'లైగర్' బ్యూటీ సిగరెట్ తాగుతుందంటూ గతంలో కొన్ని బాలీవుడ్ సైట్లు రాసుకొచ్చినప్పటికీ, వాటిని గాసిప్స్ గా కొట్టిపారేశారు. కానీ అవి నిజమే. ఫస్ట్ టైమ్, సిగరెట్ తాగుతూ అనన్య పాండే కెమెరాకు దొరికిపోయింది. అడ్డంగా బుక్కయిపోయింది.

తన కజిన్ అలనా పాండే మెహందీ ఫంక్షన్ కు హాజరైంది అనన్య పాండే. ఈ ఫంక్షన్ కోసం ప్రత్యేకంగా ముస్తాబైంది. కారు దిగి మీడియా కెమెరాలకు పోజులు కూడా ఇచ్చింది. ఎప్పుడైతే లోపలకు వెళ్లిందో, ఆ వెంటనే సిగరెట్ తీసి వెలిగించింది.

ఆమె సిగరెట్ తాగుతున్నప్పుడు ఫంక్షన్ లో ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్ తో ఫొటోతీశాడు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. అయితే అలా పెట్టిన కొద్దిసేపటికే అతడు ఆ పిక్ ను డిలీట్ చేశాడు. అయితే అప్పటికే చాలామంది ఆ స్క్రీన్ షాట్ ను సేవ్ చేశారు.

అనన్య ధూమపానంపై సోషల్ మీడియాలో గుప్పుగుప్పుమంటూ చర్చ సాగుతోంది. “అనన్య స్మోకర్ అవుతుందని నేను అస్సలు ఊహించలేదంటూ” ఓ నెటిజన్ కామెంట్ చేస్తే, ఆమె చాలా స్టయిల్ గా సిగరెట్ తాగుతోందంటూ మరో వ్యక్తి రియాక్ట్ అయ్యాడు.

అనన్య స్మోకింగ్ పై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. అదే స్థాయిలో చాలామంది ఇదంతా కామన్ అన్నట్టు స్పందించారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు సిగరెట్లు తాగడం రొటీన్ వ్యవహారమని, బాలీవుడ్ లో హీరోయిన్లంతా సిగరెట్లు తాగుతారని పోస్టులు కనిపిస్తున్నాయి.