యాంక‌ర్ అన‌సూయ అంటే అంత‌గా తిడుతారా?

బుల్లితెర హాట్ యాంక‌ర్‌గా ప్ర‌స్థానం మొద‌లు పెట్టి వెండితెర‌పై కూడా త‌ళుక్కుమ‌ని మెరిశారు అన‌సూయ‌. త‌క్కువ సినిమాలే చేసిన‌ప్ప‌టికీ అభిమానుల హృద‌యాల్లో నిలిచే పాత్ర‌ల్లో న‌టించారామె. రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ‌త్త పాత్ర‌లో త‌న‌దైన స్టైల్‌లో…

బుల్లితెర హాట్ యాంక‌ర్‌గా ప్ర‌స్థానం మొద‌లు పెట్టి వెండితెర‌పై కూడా త‌ళుక్కుమ‌ని మెరిశారు అన‌సూయ‌. త‌క్కువ సినిమాలే చేసిన‌ప్ప‌టికీ అభిమానుల హృద‌యాల్లో నిలిచే పాత్ర‌ల్లో న‌టించారామె. రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ‌త్త పాత్ర‌లో త‌న‌దైన స్టైల్‌లో అన‌సూయ జీవించారు.

బుల్లితెర‌, వెండితెర‌ల‌పై రాణిస్తున్న అన‌సూయ‌కు అభిమానుల‌కు కొద‌వ‌లేదు. తాజాగా ఓ అభిమాని అన‌సూయ‌కు భావోద్వేగ సందేశం పంపారు. దాన్ని చ‌దివి అన‌సూయ కూడా ఎమోష‌న్ అయ్యారు. ముందుగా అభిమాని ఏం రాశారో తెలుసుకుందాం.

‘అనసూయ గారు  మీరు నిజంగా గొప్ప వ్యక్తి. మీపై అభిమానంతో మీ ఫ్యాన్‌ పేరుతో నేను ట్విటర్‌ ఖాతా తెరిచా. దీంతో చాలా మంది చాలా రకాలుగా తిడుతున్నారు. న‌న్ను మాత్రం తిట్టి ఉంటే బాధ‌ప‌డేవాన్ని కాదు. నా కుటుంబాన్ని కూడా తిట్ట‌డం ఆవేద‌న క‌లిగిస్తోంది. దీన్నిబ‌ట్టి  మిమ్మల్ని నేరుగా ఎంత మంది ఎన్ని ర‌కాలుగా బాధపెట్టి ఉంటారో అర్థం చేసుకున్నా. కానీ వీట‌న్నిటిని త‌ట్టుకుంటూ, మిమ్మల్ని శక్తివంతమైన మహిళగా పెంచినం  మీ తల్లిదండ్రులకు హ్యాట్సాఫ్‌.  తిట్టే వారి గురించి పట్టించుకోకుండా దృఢంగా ఉండండి. మీకు మేం ఉన్నాం. లవ్‌ యు..’ అంటూ నాలుగు పేజీల లేఖ రాశాడు.

ఈ లేఖ అన‌సూయ‌ను తీవ్ర ఆవేద‌న‌కు గురి చేసింది. మ‌రో వైపు ఇంత ప్రేమకు అర్హురాలు కావడం త‌న‌కెంతో ఆనందాన్ని ఇస్తోంద‌ని అన‌సూయ భావోద్వేగంతో స్పందించారు.

‘ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీరు నా వల్ల తిట్లు తింటూ, బాధపడుతున్నారు. కానీ నేను చెప్పగలిగింది, న‌మ్మేది ఒక్కటే. మనం అనుకున్నది, కావాలని కోరుకున్నది వస్తుందని నమ్మినప్పుడు, దాన్ని ప్రోత్సహించేందుకు మన వాళ్లు చుట్టూ ఉన్నప్పుడు.. ఏదీ మనల్ని బాధించదు. నా వల్ల నువ్వు ఇన్ని ఇబ్బందులు పడటం నాకు బాధగా ఉంది. ఏం చెప్పను. నువ్వు నా అభిమానివి కావడం గర్వంగా ఉంది. మనమంతా దృఢంగా ఉండాలి. నీకు కేవలం ధన్యవాదాలు చెబితే సరిపోదు’ అని సోష‌ల్ మీడియాలో త‌న మార్క్ స్పంద‌న వెల్ల‌డించారు. అన‌సూయ‌కు అభిమానులు ఎంత మంది ఉన్నారో…ద్వేషించే వాళ్లు కూడా త‌క్కువేం కాద‌ని దీన్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. 

మరో 30ఏళ్ళు నువ్వే ఉండాలన్నా

రెండో భార్యతో తిరుమలకు దిల్ రాజు