రాశిఫలాలు.. 21.06.20 నుంచి 27.06.20 వరకు

మేషం: కొత్త విధానాలు, అంచనాలతో ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. అనుకున్న కార్యక్రమా లలో పురోగతి సాధిస్తారు. ఇతరులకు సేవలందించి  ప్రేమానురాగాలు నిరూపించుకుంటారు. కొత్తకొత్త ఆలోచనలు స్పురించి వాటిని అమలు చేసేందుకు కషిచేస్తారు. కుటుంబంలో…

మేషం: కొత్త విధానాలు, అంచనాలతో ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. అనుకున్న కార్యక్రమా లలో పురోగతి సాధిస్తారు. ఇతరులకు సేవలందించి  ప్రేమానురాగాలు నిరూపించుకుంటారు. కొత్తకొత్త ఆలోచనలు స్పురించి వాటిని అమలు చేసేందుకు కషిచేస్తారు. కుటుంబంలో కొద్దిపాటి ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆహ్లాదకర వాతా వరణ నెలకొంటుంది. ఆరోగ్యం కొంత కుదుటపడు తుంది. అయితే జలుబు వంటిరుగ్మతలు తప్పవు. రావలసిన మొండిబాకీలుకూడా వసూలవుతాయి. వత్తులు, వ్యాపారాలలో అభివద్ధి కనిపిస్తుంది. ఉద్యో గవర్గాలకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ధార్మిక కార్యక్రమాలు చేపడతారు. రాజకీయవేత్తలు, కళాకారులు విజయాల బాటలో పయనిస్తారు. మహిళలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం: ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. మిత్రులతో వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.వాహన, భూయోగం. రావలసిన డబ్బు అందుతుంది. కుటుంబ సమస్యలు యుక్తితో  పరిష్కరించుకుంటారు. ఆరోగ్యపరంగా స్వల్ప చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు అందుతాయి.ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలు విదేశీ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటారు.రాజకీయవర్గాలు కొత్త పదవులు కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. మహిళలకు కుటుంబంలో గౌరవం లభిస్తుంది. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

మిథునం: సన్నిహితుల సాయం పొందుతారు. వ్యవహారాలు సంతప్తికరంగా సాగుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. బాకీలు అందుతాయి. కుటుంబసభ్యులతో కొన్ని విషయాలలో రాజీకి వస్తారు. ఆరోగ్యం విషయంలో గతం కంటే మెరుగుపడుతుంది. వ్యాపారాలలో అనుకున్నలాభాలు అందుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. రాజకీయ, కళారంగాల వారు సన్మానాలు,సత్కారాలు పొందుతారు. విద్యార్థులకు పరిశోధనలలో అనుకూల ఫలితాలు. మహిళలకు కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

కర్కాటకం: పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.  నిరుద్యోగుల యత్నాలు సఫలం. భూములు, వాహనాలు కొంటారు. రుణబాధల నుంచి విముక్తి. ఆకస్మిక ధనలబ్ధి. కుటుంబంలో మీపై అభాండాలు తొలగుతాయి. శుభకార్యాల నిర్వహణ. కొన్ని రుగ్మతల నుంచి విముక్తి. వ్యాపార విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కోరుకున్న విధంగా ప్రమోషన్లు దక్కుతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలు. అనుకూల సమయమే. పదవులు దక్కుతాయి. విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. మహిళలు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. షేర్ల విక్రయాలలో లాభాలు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం: దూరప్రయాణాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించని స్థితి.  బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు.  రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. రుణయత్నాలు. కుటుంబసభ్యులతో వైరం. లేనిపోని చికాకులు. కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారాలలో కొంత అసంతప్తి కలిగిస్తాయి. ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటారు. విద్యార్థులు మరింత కషి చేయడం మంచిది. మహిళలకు పరిస్థితులు కొంత ఆందోళన కలిగిస్తాయి. షేర్ల విక్రయాలు మందగిస్తాయి. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

కన్య: పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సన్నిహితులు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. కాంట్రాక్టులు పొందుతారు. వాహన, కుటుంబసౌఖ్యం. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అంది ఆశ్చర్యపోతారు.  అప్పులు తీరతాయి. కుటుంబసమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యపరంగా గతం నుంచి వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయవర్గాలకు కొత్తపదవులు లభిస్తాయి. విద్యార్థులకు పరిశోధనలలో విజయం. మహిళలకు శుభవర్తమానాలు అందుతాయి. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

తుల: పనులు చాకచక్యంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తుసామగ్రి కొంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వాహనయోగం. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు.కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలాభాలు, రుణబాధలు తొలగుతాయి.జలుబు వంటి రుగ్మతలు తప్పవు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలు  లాభాలు దిశగా సాగుతాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఓర్పుతో విధులు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. పారిశ్రామిక, రాజకీయవర్గాలు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.విద్యార్థులు సాంకేతిక విద్యలలో అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

వశ్చికం: జీవితాశయం నెరవేరుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. సంఘం లో గౌరవప్రతిష్టలు పెరుగుతాయి. కాంట్రాక్టు లు దక్కించుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మొండిబాకీలు వసూలవుతాయి. ఇబ్బందులు అధిగమిస్తారు. కుటుంబం అందరితోనూ సంతోషంగా గడుపుతారు. ఈతిబాధలు తొలగుతాయి. ఆరోగ్యపరంగా  కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో విధి నిర్వహణలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారు అంచనాలు , ఊహలు నిజం చేసుకుంటారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

ధనుస్సు: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ముఖ్య వ్యవహారాలు సజావుగా  సాగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికపరమైన ఒడిదుడుకులు తొలగుతాయి. రుణాలు తీరి ఉపశమనం పొందుతారు. కుటుంబంలో .శుభకార్యాలు నిర్వహిస్తారు. మీ మాటే చెల్లుబాటు కాగలదు. శారీరకంగా బలం చేకూరుతుంది. ఔషధసేవనం నుంచి విముక్తి. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు రాగలవు. పారిశ్రామిక, రాజకీయవర్గాలు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. సమస్యలు తీరతాయి. కళాకారులు అవార్డులు దక్కించుకుంటారు. విద్యార్థులు పరిశోధనలపై దష్టి సారిస్తారు. మహిళలకు ఆస్తిలాభాలు. షేర్ల విక్రయాలలో లాభాలు అందుతాయి. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

మకరం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి సంఘటనలు ఎదురవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కొన్ని బాకీలు వసూలవుతాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి.కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు కాగలవు.స్వల్ప అనారోగ్యం, ఉపశమనం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. కళాకారులు సన్మానాలు పొందుతారు. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు దక్కుతాయి. మహిళలు సంతోషకరమైన వార్తలు వింటారు. షేర్ల విక్రయాలలో లాభాలు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ఛాలీసా పఠించండి.

కుంభం: సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీ ఊహలు నిజం చేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు లభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి ఉండవచ్చు. కుటుంబంలో ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. ఆరోగ్యం కాస్త కుదుటపడుతుంది. వ్యాపారాలలో కొత్తపెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. ప్రమోషన్ అవకాశాలు. పారిశ్రామికవర్గాల వారు  కొత్త సంస్థల్లో భాగస్వాములవుతారు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి.విద్యార్థులకు ఫలితాలు సంతప్తికరంగా ఉంటాయి. మహిళలు కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు.షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మీనం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు.  సభ్యులతో విభేదాలు తొలగుతాయి.ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. రుణబాధలు తొలగుతాయి.  స్వల్ప శారీరక రుగ్మతలు.వ్యాపారాలలో కొత్త పెట్టుబడులతో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు  ప్రభుత్వపరంగా సహాయం, ఆహ్వానాలు రాగలవు. సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తి చూపుతారు. మహిళలకు శుభవర్తమానాలు.షేర్ల విక్రయాలలో లాభాలు అందుతాయి. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

Vakkantham Chandra Mouli 
www.janmakundali.com