సోషల్ మీడియా ట్విట్టర్‌కు స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా టాటా చెప్పేశారు. ఈ సందర్భంగా ఆమె తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పారు. సోషల్ మీడియాతో ప్రశాంతత కరవు అవుతుందన్నారు. నెగిటివిటీకి దూరంగా ఉండాలంటే సోషల్ మీడియాలో ఉండకూదన్నారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్‌ను పరిశీలిస్తే మరిన్ని విషయాలు తెలిసొస్తాయి.
‘‘నీ చిత్తశుద్ధిని కాపాడుకోవాలంటే.. నువ్వు వెంటనే చేయాల్సింది నెగిటివిటీకి దూరంగా ఉండటం. ముఖ్యంగా ట్విట్టర్‌కి దూరంగా ఉండాలి. కావున నేను నా అకౌంట్‌ని డీయాక్టివేట్ చేస్తున్నా. ప్రశాంతంగా ఉండండి” అని సోనాక్షి సిన్హా తన లాస్ట్ ట్వీట్లో పేర్కొన్నారు.
కాగా సోనాక్షి ట్విట్టర్ నుంచి తప్పుకోడానికి కారణాలపై బాలీవుడ్లో చర్చ జరుగుతోంది. ఇటీవల సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా నుంచి కొంత కాలం తప్పుకోవడం, ఆ తర్వాత మళ్లీ యాక్టీవ్ కావడం చూస్తున్నాం. ఇదో పబ్లిసిటీ స్టంట్‌గా మారింది. మరి సోనాక్షి సిన్హా ఎంత కాలం సోషల్ మీడియాకి దూరంగా ఉంటారో కాలమే జవాబు చెప్పాలి,