ప్రస్తుతం అనసూయ చేస్తున్న సినిమా పుష్ప. ఇందులో ఆమె దాక్షాయణి పాత్రలో కనిపించనుంది. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది. రంగస్థలం తర్వాత అనసూయకు అంత పేరును పుష్ప సినిమా తీసుకొస్తుందని అంతా అనుకుంటున్నారు. కానీ అనసూయ గురి మాత్రం మరో సినిమాపై ఉంది.
సైలెంట్ గా ఆమె ఓ సినిమా పూర్తిచేస్తోంది. దానికి సంబంధించి ఇంకా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాలేదు. తాజాగా ప్రీ-లుక్ మాత్రం రిలీజ్ చేశారు. ఆ సినిమా తనకు లైఫ్ టైమ్ ఇమేజ్ తీసుకొస్తుందని గట్టిగా భావిస్తోంది అనసూయ. అదే ఎయిర్ హోస్టెస్ పాత్ర.
ఇంతకుముందు పేపర్ బాయ్, విటమిన్-షి సినిమాలతో దర్శకుడిగా అందరిని ఆకట్టుకున్న జయశంకర్.. మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇంకా పేరుపెట్టని ఈ సినిమాలో అనసూయ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ క్యారెక్టర్ తనకు తిరుగులేని ఇమేజ్ తీసుకొస్తుందని, అనసూయ తన సర్కిల్స్ లో చెబుతోంది.
గతంలో రంగస్థలం, క్షణం సినిమాలకు తనకు ఎంత పేరు తెచ్చిపెట్టాయో.. జయశంకర్ మూవీ అంతకుమించి క్రేజ్ తీసుకొస్తుందని, సినిమాలో తన పాత్ర చాలా షాకింగ్ ఉంటుందని అందరికీ చెబుతోంది. అంతకుమించి డీటెయిల్స్ మాత్రం అటు యూనిట్, ఇటు అనసూయ బయటపెట్టడం లేదు.
తనకు టీవీ ద్వారా చాలా డబ్బు వస్తుందని, సినిమాల ద్వారా తను గుర్తింపును మాత్రమే కోరుకుంటున్నానని గతంలో క్లియర్ గా చెప్పేసింది అనసూయ. అందుకు తగ్గట్టుగానే సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ ఎయిర్ హోస్టెస్ పాత్ర తన కెరీర్ లోనే బెస్ట్ గా నిలుస్తుందని బెట్ కాస్తోంది.
ఇక మూవీ అప్ డేట్స్ విషయానికొస్తే, ప్రస్తుతం అనసూయపై ఓ షెడ్యూల్ నడుస్తోంది. డిసెంబర్ లో మరో షెడ్యూల్ ఉంటుంది. దాంతో టోటల్ షూట్ కంప్లీట్ అవుతుంది. ఓ మంచి టైమ్ చూసి గ్రాండ్ గా ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నారు.