యాంగ్రీ హీరో…(రాజ‌) శేఖర్

యాంగ్రీ హీరో రాజ‌శేఖర్…ఒకప్పుడు రాజ‌శేఖర్ యాక్షన్, ఎమోషన్ సినిమాలు అంటే ఓ క్రేజ్. చాలా కాలం గ్యాప్ తరువాత తనకు సరిపడే సరైన పాత్రను ఎన్నుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు రాజ‌శేఖర్.  Advertisement మలయాళంలో…

యాంగ్రీ హీరో రాజ‌శేఖర్…ఒకప్పుడు రాజ‌శేఖర్ యాక్షన్, ఎమోషన్ సినిమాలు అంటే ఓ క్రేజ్. చాలా కాలం గ్యాప్ తరువాత తనకు సరిపడే సరైన పాత్రను ఎన్నుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు రాజ‌శేఖర్. 

మలయాళంలో హిట్ అయిన జోసఫ్ సినిమా ఆధారంగా తెలుగులో శేఖర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈనెల 20న థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు.

రాజ‌శేఖర్ లుక్స్ పరంగా పక్కాగా పాత్రకు ఫిట్ అయ్యాడు. మిడిల్ ఏజ్డ్ లుక్స్ కూడా బాగానే వున్నాయి. సినిమా కంటెంట్ ను వీలయినంత వరకు రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు. సస్పెన్స్ ను మెయింటెయిన్ చేస్తూనే, వీలయినన్ని ఆసక్తికరమైన సీన్లు ట్రయిలర్ లో కట్ చేసారు. ఆ విధంగా ట్రయిలర్ ను ఆసక్తికరంగా మలిచారు.

జీవిత రాజ‌శేఖర్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజ‌శేఖర్ తో పాటు ఆయన కుమార్తె శివానీ, ముస్కాన్, అభినవ్ గోమటం, రవివర్మ తదితరులు నటించారు. లక్ష్మీ భూపాల మాటలు అందించారు. వంకాయలపాటి మురళీ కృష్ణ, శ్రీనివాస్ బొగ్గారం, సుధాకరరెడ్డి నిర్మాతలు.